Balochistan బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా పాకిస్తాన్ నుంచి విడిపోయిందంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బుధవారం మే 14న ప్రకటించుకున్నది. ఇక అప్పట్నుంచి బలూచిస్తాన్ ప్రాంతాల్లో ప్రతి పట్టణంలో పండగ చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు. బలూచిస్తాన్ సెక్యులర్ దేశమనీ, ఇక్కడ ప్రపంచంలోని అన్ని మతాల వారు స్వేచ్ఛగా వుండవచ్చంటూ వెల్లడిస్తున్నారు బలూచ్ బీఎల్ఎ ఉద్యమకారులు.
మరోవైపు తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలంటూ ప్రపంచంలోని పలు దేశాలకు వారు లేఖలు కూడా రాసారు. మరి ప్రపంచ దేశాల స్పందన ఎలా వుంటుందో చూడాల్సి వుంది.