Webdunia - Bharat's app for daily news and videos

Install App

eSanjeevani పథకం గురించి తెలుసా? ఏబీడీఎంతో లింక్ అయిన ఇ-సంజీవని

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (17:11 IST)
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన టెలిమెడిసిన్ సర్వీసు ఇ-సంజీవనిని తన ప్రధాన పథకం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం)తో విలీనం చేస్తున్నట్లు నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్ చ్ఏ) శుక్రవారం ప్రకటించింది.
 
ఈ సంజీవని వినియోగదారులు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఎబిహెచ్ఎ)ను సులభంగా సృష్టించడానికి, ప్రిస్క్రిప్షన్లు, ల్యాబ్ రిపోర్టులు వంటి వారి ప్రస్తుత ఆరోగ్య రికార్డులను లింక్ చేయడానికి దీనిని ఉపయోగించుకోవచ్చు. 
 
వినియోగదారులు తమ ఆరోగ్య రికార్డులను ఈ సంజీవనిపై వైద్యులతో పంచుకోగలుగుతారు, ఇది మెరుగైన క్లినికల్ నిర్ణయాలు తీసుకోవడానికి మరియు సంరక్షణ యొక్క కొనసాగింపును ధృవీకరించడానికి సహాయపడుతుంది.
 
ఈ ఇంటిగ్రేషన్ యొక్క ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఆర్.ఎస్. శర్మ, సీఈవో (ఎన్‌హెచ్ఏ) మాట్లాడుతూ, మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న డిజిటల్ ఆరోగ్య పరిష్కారాలు, భాగస్వాములలో అంతరాలను పూడ్చడానికి డిజిటల్ రహదారులను నిర్మించాలని ఏబీడీఎమ్ లక్ష్యంగా పెట్టుకుంది. 
 
22 కోట్ల మంది ఎబిహెచ్‌ఎ హోల్డర్లు ఈ సంజీవని ద్వారా సృష్టించిన వారి ఆరోగ్య రికార్డులను నేరుగా తమకు నచ్చిన హెల్త్ లాకర్లలో లింక్ చేసి నిల్వ చేయడానికి ఎబిడిఎమ్‌తో ఇ-సంజీవని అనుసంధానం చేసిందన్నారు 
 
మొత్తం సంప్రదింపుల ప్రక్రియను కాగిత రహితం చేసే ఈ-సంజీవనిపై వినియోగదారులు గతంలో లింక్ చేసిన ఆరోగ్య రికార్డులను వైద్యులతో పంచుకోవచ్చని డాక్టర్ ఆర్.ఎస్. శర్మ చెప్పారు.
 
ఈ సంజీవని సర్వీస్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. మొదటిది ఈ సంజీవని ఆయుష్మాన్ భారత్-హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ (ఎబి-హెచ్ డబ్ల్యుసి) - డాక్టర్-టు-డాక్టర్ టెలీమెడిసిన్ సేవ, దీని ద్వారా హెచ్ డబ్ల్యుసిని సందర్శించే లబ్ధిదారులు వైద్యులు, నిపుణులతో వర్చువల్‌గా కనెక్ట్ కావచ్చు.
 
రెండవ వేరియంట్, ఈ సంజీవని OPD దేశవ్యాప్తంగా ఉన్న రోగులకు సేవలందిస్తోంది. వారి ఇంటి నుంచి నేరుగా వైద్యులకు కనెక్ట్ చేయబడుతుంది. ఈ రెండు వెర్షన్‌లు ABDM ప్లాట్ ఫారంతో ఇంటిగ్రేట్ చేయబడ్డాయి.
 
ఇ-సంజీవని గురించి.. 
కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. వీటిల్లో ఇ-సంజీవని స్కీమ్ కూడా ఒకటి. ఈ పథకం కింద ప్రజలు ఉచితంగానే వైద్య సేవలు పొందొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ఈ పథకం కింద ల్యాప్ టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్ ద్వారా వైద్య సేవలు పొందడం వీలవుతుంది.
 
నేషనల్ టెలీ కన్సల్టేషన్ సర్వీస్‌లో భాగంగా ఇసంజీవని సేవలు లభిస్తున్నాయి. దీనికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు. అధికారిక వెబ్‌సైట్ https://esanjeevaniopd.in/ ద్వారా ఈ సేవలను పొందవచ్చు. 
 
కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను అందిస్తోంది. అయితే డాక్టర్ల నియామకం ప్రక్రియను మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి. స్టేట్ హెల్త్ డిపార్ట్‌మెంట్ వీరి నియామకాన్ని చేపడుతుంది. ఏరోజు టోకెన్లు ఆరోజే క్లోజ్ అవుతాయి. అలాగే కాల్ నౌ బటన్ కనిపించిన తర్వాత 120 సెకన్లలో ఓకే చేయకపోతే.. అప్పుడు మీ నెంబర్ మళ్లీ కిందకు వెళ్లిపోతుంది. అప్పుడు మీరు కన్సల్టేషన్ కోసం మరి కొంత సమయం ఆగాల్సి ఉంటుంది.
 
నేషనల్ టెలీకన్సల్టేషన్ సర్వీసులు ఎలా పొందాలి?
ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్‌ను వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. తర్వాత పేషంట్ రిజిస్ట్రేషన్ ఫామ్‌ను నింపాలి. హెల్త్ రికార్డ్స్‌ను అప్‌లోడ్ చేయాలి. యూజర్‌కు పేషంట్ ఐడీ, టోకెన్ నెంబర్ ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. ఇప్పుడు లాగిన్ అవ్వాలి. మీ ఫోన్‌ను లాగిన్ అవ్వాలని మెసేజ్ వస్తుంది. పేషంట్ ఐడీ సాయంతో లాగిన్ అవ్వొచ్చు. మీకు నెంబర్ లభిస్తుంది.
 
ఇసంజీవని ఓపీడీ మీకు ఒక డాక్టర్‌ను కేటాయిస్తుంది. క్యూ ఆధారంగా టైమ్ ఎక్కువ, తక్కువ ఉండొచ్చు. ఎవ్వరూ లేకపోతే వెంటనే మీకు డాక్టర్ కేటాయింపు ఉంటుంది. లేదంటే కొద్దిసేపు వేచి ఉండాలి. డాక్టర్ కేటాయింపు తర్వాత కాల్ నౌ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. 120 సెకన్లలోగా ఈ పని చేయాల్సి ఉంటుంది. బటన్‌పై క్లిక్ చేసిన 10 సెకన్లలోగా డాక్టర్ మీకు కనిపిస్తారు. ఇప్పుడు డాక్టర్ మీ హెల్త్ రికార్డ్స్ అన్నింటికీ పరిశీలిస్తారు. మీరు కూడా మాట్లాడొచ్చు. సమస్యలు తెలియజేయవచ్చు. 
 
మీకు ఇప్రిస్క్రిప్షన్ రాయిస్తారు. దీన్ని మీకు పంపిస్తారు. తర్వాత కాల్ కట్ అవుతుంది. మీరు ఇప్రిస్క్రిప్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత లాగాఫ్ కావొచ్చు. మీ మొబైల్ నెంబర్‌కు కూడా ఇప్రిస్క్రిప్షన్ డౌన్‌లోడ్ లింక్ వస్తుంది.
 
గుర్తించుకోవాల్సిన అంశాలు
ఇసంజీవని ఓపీడీ అనేది వెబ్ అప్లికేషన్. అందువల్ల మీ ఇంట్లో నెట్ స్పీడ్‌గా ఉండేలా చూసుకోండి. అప్పుడే ఎలాంటి అంతరాలు ఉండవు. కాల్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. పేషెంట్ డీటైల్స్‌ ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీటిని మార్చడం కుదరదు. అయితే మొబైల్ నెంబర్, ఈమెయిల్ వంటివి అప్‌డేట్ చేసుకుంటూ ఉండొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లపై పొంగల్ సాంగ్

అజిత్ కుమార్, త్రిష మూవీ విడాముయర్చి నుంచి లిరిక‌ల్ సాంగ్

డ్రీమ్ క్యాచర్ ట్రైలర్ చూశాక నన్ను అడివిశేష్, రానా తో పోలుస్తున్నారు : ప్రశాంత్ కృష్ణ

క్రిస్మస్ సెలవులను ఆస్వాదిస్తున్న సమంత.. వినాయక పూజ..?

3 సినిమాతో తన కెరీర్ ముదనష్టం అయ్యిందంటున్న శ్రుతి హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments