Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో మితిమీరిపోతున్న ఇసుక అక్రమ రవాణా!

చిత్తూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ, అదుపూ లేకుండా పోతోంది. ఇసుక మాఫియా దారులు రోజురోజుకు పెరిగిపోతూ యధేచ్ఛగా ఇసుకను అక్రమ రవాణా చేసేస్తున్నారు. పాలారు, బాహుదా, అరణియారు‌, అరుణా కాళంగి, రాష్ట్ర

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (12:26 IST)
చిత్తూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ, అదుపూ లేకుండా పోతోంది. ఇసుక మాఫియా దారులు రోజురోజుకు పెరిగిపోతూ యధేచ్ఛగా ఇసుకను అక్రమ రవాణా చేసేస్తున్నారు. పాలారు, బాహుదా, అరణియారు‌, అరుణా కాళంగి, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రవహించే జిల్లాలోని నదులు. ఇవే ఇప్పుడు కొందరు అంతరాష్ట్ర చీకటి వ్యాపారులకు వనరులు. ఈ నదులు, ఏరులు, వాగుల్లో ఇసుక తవ్వేస్తున్న వ్యాపారులు.. అర్థరాత్రుల్లో అడ్డదారుల్లో సరిహద్దులు దాటిస్తున్నారు.
 
పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్‌ మేరకు అమ్ముకుంటున్నారు. ప్రకృతి వనరులను సామాన్యులకు ఉచితంగా అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. వ్యాపారుల అక్రమాలకు వత్తాసు పాడుతూ జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులు, ఆర్టీఏ పోలీసు విభాగాలు సహకరిస్తున్నాయని ఆరోపణలు లేకపోలేదు. యేడాది కాలంలోనే ఉచితం ఎలా అనుచితమైందో పరిశీలిస్తే...
 
జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో వాగులు నోళ్ళు తెరుచుకున్నాయి. నగరి, సత్యేవేడు, శ్రీకాళహస్తి, చిత్తూరు, పూతలపట్టు, కుప్పం, పలమనేరు నియోజవర్గాలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దున ఉన్నాయి. ఇక్కడి నదులు, వాగులు, వంకలు నుంచి అనుమతులకు మించి ఇసుక తోడేస్తున్నారు. నగరి, విజయపురం, పుత్తూరు మండలాల నుంచే రోజుకు 200 లారీల ఇసుక పొరుగు రాష్ట్రానికి తరలుతుండటం తీవ్రతకు అద్దం పడుతోంది. నాగలాపురం, పిచ్చాటూరు ప్రాంతాల్లోనూ అరుణా, అరణియారు నదుల్లో మీటర్ల కొద్దీ లోతుల్లో తోడేస్తున్నారు. 
 
కుప్పం ప్రాంతం నుంచి బెంగుళూరుకు సరఫరా చేస్తున్నారు. అక్రమార్కులు పగటి పూట ఇక్కడి నదుల్లో తవ్వి మారుమూల ప్రాంతాల్లో కుప్పలుగా పోసి రాత్రి వేళల్లో సరిహద్దులు దాటిస్తున్నారు. ఉదాహరణకు ఎపీ27 టీఎక్స్ 7299 నెంబరు గల లారీ ఆగస్టు 10వ తేదీ అనుమతి లేకుండా కర్ణాటకకు ఇసుకను తరలిస్తుండగా పలమనేరు వాణిజ్య పన్నుల శాఖ తనిఖీ కేంద్రం వద్ద పట్టుకున్నారు. 1.50 లక్షల రూపాయలు జరిమానా విధించారు. మళ్ళీ ఆగస్టు 22వ తేదీన ఇదే తరహాలో మరో వాహనంలో ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక తరలిపోతుంటే పట్టుకున్న వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది రూ.50 వేలు అనధికారికంగా వసూలు చేసి వాహనాన్ని సరిహద్దు దాటించారు. 
 
అసలు ఆ వాహనాన్ని పట్టుకున్నట్లు ఎక్కడా రికార్డుల్లో నమోదు చేయలేదు. నిత్యం ముందస్తు ఒప్పందంతో అక్కడి సిబ్బంది సూచించిన సమయాల్లో ఇసుక వాహనాలు ఎలాంటి అనుమతులు లేకుండా యధేచ్చగా సరిహద్దు దాటిపోతున్నాయి. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. నిత్యం ఇలాంటి అక్రమాలు తంతు యధేచ్ఛగా సాగుతోంది.
 
నిబధనల ప్రకారం నదుల్లో యంత్రాలతో తవ్వరాదు. ప్రతి రేవుకు పర్యావరణ అనుమతి తప్పనిసరి. యంత్రాలతో తవ్వినా సరిహద్దులు దాటించినా అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవు. భూగర్భ జలాలకు, పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా అనుమతించిన రేవుల్లో మాత్రమే ఇసుకను తవ్వుకోవాలి అంటూ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకువచ్చిన సందర్భంలో చేసిన హెచ్చరిక. కానీ ఈ నిబంధన అదే ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల అండతో తాటాకు చప్పుడుగా మిగిలింది.
 
తూర్పు ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే ఇసుక రేవుల మీదే రూ.కోట్లకు పడగలెత్తడం గమనార్హం. కూలీలతో మాత్రమే తవ్వుకోవాలన్నా నిబంధనలున్నా, యంత్రాలతో తవ్వి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు. సరిహద్దులు దాటించడం ట్రాక్టర్లు, బండ్లలో అయితే కుదరదు కాబట్టి తక్కువ సమయంలో భారీ లారీలను నింపేందుకు ప్లొక్లైయిన్‌ వాడుతున్నారు. జిల్లాలో చిన్నా పెద్దా కలిపి మొత్తం 114 ఇసుక రేవులను ప్రభుత్వం గుర్తించి అనధికారికంగా తవ్వకాలకు అనుమతినిచ్చింది. వాటిలో మాత్రమే స్థానిక అవసరాలకు ఉచితంగా తప్పుకోవచ్చు. ఒక మీటరుకు మించి తవ్వకూడదన్న నిబంధనలను పక్కనబెట్టి ఉచితమనే ప్రకటనను అవకాశంగా చేసుకుని ఎక్కడ పడితే అక్కడ త్రవ్వేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments