Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీటర్‌ ఎక్కువసేపు వాడిందని... స్నానాల గది నుంచి వివస్త్రను చేసి భార్యపై దాడి.. ఆత్మహత్య

హైదరాబాద్‌ నగరంలో భర్త పైశాచికంగా ప్రవర్తించాడు. హీటర్‌ను ఎక్కువ సేపు వాడిందనీ భార్యను వివస్త్రను చేసి చితక్కొట్టాడు. బాత్ రూంలో స్నానం చేస్తున్న భార్యను వివస్త్రగానే బయటకు లాక్కుని వచ్చిన ఆ భర్త చేసి

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (12:18 IST)
హైదరాబాద్‌ నగరంలో భర్త పైశాచికంగా ప్రవర్తించాడు. హీటర్‌ను ఎక్కువ సేపు వాడిందనీ భార్యను వివస్త్రను చేసి చితక్కొట్టాడు. బాత్ రూంలో స్నానం చేస్తున్న భార్యను వివస్త్రగానే బయటకు లాక్కుని వచ్చి ఆ భర్త దాడితో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సైదాబాదుకు చెందిన మోహన్‌తో నల్లగొండ జిల్లాకు చెందిన సుశ్రుతకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మోహన్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, సుశ్రుత గృహిణిగా ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం స్నానం చేసేందుకు వేడి నీళ్లు పెట్టుకున్న సుశ్రుత వాటర్ హీటర్ కాస్తంత ఎక్కువ సేపు ఆన్‌లో ఉంచింది. 
 
ఆ తర్వాత ఆమె స్నానానికి వెళ్లగా.. విషయం గ్రహించిన మోహన్... ఆమె స్నానం ముగియకముందే బాత్ రూంలోకి చొరబడ్డాడు. హీటర్‌ను ఎక్కువసేపు ఎందుకు వాడావంటూ ఆమెపై అక్కడే చేయి చేసుకున్నాడు. పొరపాటైందని సుశ్రుత వేడుకున్నా వినని మోహన్ ఆమెను వివస్త్రగానే బయటకు లాక్కొచ్చాడు.
 
అత్తామామలు, ఆడబిడ్డ, పిల్లల ముందుకు తనను వివస్త్రగా లాక్కొచ్చిన వైనంపై సుశ్రుత తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో తన గదిలోకి వెళ్లిపోయిన ఆమె... తనకు జరిగిన అవమానాన్ని తల్లిదండ్రులకు వివరిస్తూ వాట్సప్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుశ్రుత వాట్సాప్‌లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments