Webdunia - Bharat's app for daily news and videos

Install App

+92, +1, +968, +44 నంబర్లతో ఫోన్ వస్తే అంతే...

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (14:05 IST)
ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా, సైబర్ నేరగాళ్లు అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా +92, +1, +968, +44 పాటు +473, +809, +900 సిరీస్‌లతో కూడిన ఫోన్ నంబర్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే ఎవరికైనా ఈ సిరీస్ ఫోన్ నంబర్ల నుంచి ఫోన్ వచ్చినపుడు తెలియకుండా ఫోన్ తీస్తే మాత్రం మీ సమస్త సమాచారం గల్లంతుకావడం ఖాయమని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
ఈ మేరకు ఓ వీడియోను రూపొందించిన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు‌. రోజు రోజుకూ సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త ఎత్తుగడలతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లు రూ.లక్షల్లో కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు టెలీకాం, సైబర్‌ క్రైం పోలీసులు గుర్తించారు. కొన్ని సిరీస్‌లతో కూడిన నంబర్‌లతో ఫోన్లు చేసి ప్రజలను బురిడీకొట్టిస్తున్నారు. ప్రజలు నంబర్‌లు గుర్తించకుండా వారి స్నేహితుల ఫొటోలతో ఆ నంబర్‌లు సేవ్‌ చేస్తున్నారు.
 
ముఖ్యంగా, +92, +1, +968, +44 నంబర్‌ సిరీస్‌లతో ఎక్కువగా నేరగాళ్లు సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్‌ మీడియాలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి ఖాతాలపై కన్నేసిన నేరగాళ్లు కొంతమందిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. 
 
వారి ఫ్రెండ్స్‌ లిస్టులోంచి కొన్ని ఫొటోలను సేకరిస్తారు. ఆ తర్వాత మోసపూరిత నంబర్‌లను ఆయా వ్యక్తుల ఫొటోలతో సేవ్‌ చేస్తారు. ఆ ఫేస్‌బుక్‌ ఖాతా ఉన్న వ్యక్తికి ఫోన్‌ చేస్తారు. స్నేహితుడు, స్నేహితురాలి ఫొటోతో ఫోన్‌ రావడంతో సదరు వ్యక్తి నంబర్‌ చూడకుండానే ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తారు. 
 
అలా చేయగానే అతని ఫోన్‌లోని సమస్త సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చేరిపోతుంది. అలా అత్యాధునిక టెక్నాలజీతో మోసపూరిత ఫోన్‌లు, వాట్సాప్‌ ఫోన్‌లు చేస్తున్నారని సైబర్‌ క్రైం పోలీసులు, టెలీకాం సంస్థల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఫోన్‌, వాట్సాప్‌ కాల్‌ లిఫ్ట్‌ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండి, ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments