హెరిటేజ్ నాది.. తెల్ల కాగితాలపై బాబు సంతకాలు చేయించుకుని?: మోహన్ బాబు

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (18:20 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ వ్యవస్థాపకుల్లో తాను ఒకడినని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. తనతో పాటు దాగా అనే మరో మిత్రుడు, చంద్రబాబు కలిసి హెరిటేజ్‌ని స్థాపించామని.. కానీ అధిక పెట్టుబడి తానే పెట్టానని.. మిగిలిన ఇద్దరూ తక్కువ పెట్టుబడి పెట్టారని తన వాటాను కొట్టేశారని మోహన్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఇంకా తన వద్ద నుంచి బ్లాంక్ పేపర్లపై సంతకాలు పెట్టించుకున్నారన్నారు. ఆ సమయంలో హీరోగా టాప్ పొజిషన్‌లో ఉన్న తాను, చాలా బిజీగా ఉన్నానని, స్నేహితుడే కదా అని చంద్రబాబును నమ్మి సంతకాలు చేశానని వెల్లడించారు. 
 
కొన్నేళ్ల తర్వాతే తనకు హెరిటేజ్‌ సంస్థతో సంబంధం లేదనే విషయం తెలిసిందన్నారు.  ఈ విషయంలో తాను కోర్టుకు వెళితే, కేసు ఎంతోకాలం సాగిందని గుర్తు చేశారు. తనను మోసం చేసి హెరిటేజ్ నుంచి తరిమేశారన్న విషయాన్ని తిరుపతి, కాణిపాకం, విజయవాడ... ఎక్కడికి వచ్చి అయినా, ఒట్టేసి చెప్పగలనని, మోసం చేయలేదని చంద్రబాబు చెప్పగలరా? అని మోహన్ బాబు నిలదీశారు. 
 
పరపతి ఉన్న చంద్రబాబును తట్టుకోలేమని ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు చెబితే, కేసును వదిలేశానని మోహన్ బాబు చెప్పారు. తాను బయటకు వచ్చిన తరువాత దాగాను కూడా మోసం చేసి తరిమేశారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments