Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలాంటి నిర్ణయం తీసుకునే తమిళ మంత్రులుంటే చాలు...? ఆంధ్ర సూపర్‌గా అభివృద్ధి....

ప్రముఖ మోటార్స్ కంపెనీ కియా ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వెళ్లిపోవడానికి తమిళనాడు మంత్రులేనన్న విమర్శలు ఊపందుకున్నాయి. ఐతే ఇంతకుముందు జయలలిత అంటే ఇటు పార్టీలోనే కాకుండా, అటు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఓ సింహస్వప్నం. ఈ పేరు ఉచ్ఛరించేందుకు ఏ ఒక

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (16:11 IST)
ప్రముఖ మోటార్స్ కంపెనీ కియా ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వెళ్లిపోవడానికి తమిళనాడు మంత్రులేనన్న విమర్శలు ఊపందుకున్నాయి. ఐతే ఇంతకుముందు జయలలిత అంటే ఇటు పార్టీలోనే కాకుండా, అటు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఓ సింహస్వప్నం. ఈ పేరు ఉచ్ఛరించేందుకు ఏ ఒక్క రాజకీయనేత సైతం సహసం చేయరు. పైగా, కాలు బయటపెట్టకుండానే కోట్లాది రూపాయల విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన మహిళా ముఖ్యమంత్రి.

అలాంటి ఆమె లేని రాష్ట్రంలో ఆమె పార్టీ అన్నాడీఎంకేకి చెందిన మంత్రులు అవినీతిఊబిలో కూరుకుని పోయారు. ఒక ఫ్యాక్టరీ పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తే.. ప్రాజెక్టుకయ్యే స్థలంలో 50 శాతం లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. దీంతో విదేశీ పెట్టుబడిదారులు ఇతర పొరుగు రాష్ట్రాలకు పారిపోతున్నారుట. తాజాగా జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 
 
కొరియాకు చెందిన కియా మోటార్స్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ప్రస్తుతం తమిళనాడులో ఒకటి ఉంది. రెండో ప్లాంట్‌ను అక్కడే పెట్టాలని ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. తమిళనాడు మంత్రుల దెబ్బకు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది. దీనికి కారణం తమిళనాడు మంత్రులే కారణం. కియా సంస్థ ఏపీకి తరలివెళ్లడానికి వెనుక మంత్రులు డిమాండ్ చేసిన అమ్యామ్యాలే కారణమన్న వాదన బలంగా వినిపిస్తోంది. 
 
చెన్నైకి సమీపంలోని ఓరగడంలో స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడుకు చెందిన స్థలం అందుబాటులో ఉండగా, దాన్ని కియాకు ఇచ్చేందుకు నిర్ణయించుకున్న తమిళనాడు మంత్రులు, ప్రాజెక్టుకయ్యే స్థలంలో 50 శాతం లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారట. దీంతో కియా యాజమాన్యం ఏపీకి వెళ్లిపోయిందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ పారిశ్రామికవేత్త వెల్లడించారు. 
 
అయితే, ఈ విమర్శలను ఆ రాష్ట్ర మంత్రి ఎంసీ సంపత్ ఖండించారు. ఒకే రాష్ట్రంలో రెండు ప్లాంటులు ఉండరాదన్న విధానంతోనే కొరియా సంస్థ ఏపీని ఎంచుకుందని వెల్లడించారు. లంచాలు అడిగామనడాన్ని తప్పుబట్టారు. నిజానికి కియాకు ఆగస్టు 2016లో 400 ఎకరాల భూమిని తమిళ సర్కారు ఆఫర్ చేసింది. ఇక్కడే రెండో యూనిట్ మొదలవుతుందని భావించినా, జయలలిత మరణం తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో కియా ఏపీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇపుడు ఈ వార్తపై తమిళనాడు ప్రజలు సెటైర్లు వేస్తున్నారు... మన మంత్రుల ఇలాంటి నిర్ణయాలు చాలు... ఏపీ అభివృద్ధి చెందడానికి అంటున్నారట.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments