Webdunia - Bharat's app for daily news and videos

Install App

1965-2016 జయలలిత సినీ, రాజకీయ ప్రస్థానం...

జయలలిత ఫిబ్రవరి 24, 1948న అప్పటి మైసూరురాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించారు. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది. జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరిం

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2016 (09:26 IST)
జయలలిత ఫిబ్రవరి 24, 1948న అప్పటి మైసూరురాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించారు. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది. జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు.
 
తిరుచ్చి జిల్లా శ్రీరంగం పూర్వీకంగా కలిగిన జయలలిత 1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించి ఎం.జి రామచంద్రన్ మరణానంతరం అతని భార్య జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిననూ ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయింది. జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానం సంపాదించింది.
 
1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది. 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉండి 2006 మే నెలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజయం పొందినది.
 
ఆమె పార్టికి కేవలము నాలుగు స్థానాలే దక్కాయి. ఆ తర్వాత ఆమెను విజయం వరించింది. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఆమే. అభిమానులు జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవి (విప్లవాత్మక నాయకురాలు) అని పిలుస్తుంటారు.
 
కుటుంబ పరిస్థితుల వలన ఈమె తల్లి బలవంతముతో తన 15వ యేట సినిమా రంగములో ప్రవేశించింది.
 
* కథానాయకుని కథ(1965)
మనుషులు మమతలు(1965)
ఆమె ఎవరు? (1966)
ఆస్తిపరులు (1966)
కన్నెపిల్ల (1966)
గూఢచారి 116(1966)
నవరాత్రి (1966)
గోపాలుడు భూపాలుడు (1967)
చిక్కడు దొరకడు(1967)
ధనమే ప్రపంచలీల(1967)
నువ్వే (1967)
బ్రహ్మచారి (1967)
సుఖదుఃఖాలు(1967)
అదృష్టవంతులు(1968)
కోయంబత్తూరు ఖైదీ(1968)
తిక్క శంకరయ్య(1968)
దోపిడీ దొంగలు(1968)
నిలువు దోపిడి(1968)
పూలపిల్ల (1968)
పెళ్ళంటే భయం(1968)
పోస్టుమన్ రాజు(1968)
బాగ్దాద్ గజదొంగ(1968)
శ్రీరామకథ (1968)
ఆదర్శ కుటుంబం(1969)
కథానాయకుడు(1969)
కదలడు వదలడు(1969)
కొండవీటి సింహం(1969)
పంచ కళ్యాణి దొంగల రాణి (1969)
ఆలీబాబా 40 దొంగలు (1970)
కోటీశ్వరుడు (1970)
గండికోట రహస్యం(1970)
మేమే మొనగాళ్లం(1971)
శ్రీకృష్ణ విజయం(1971)
శ్రీకృష్ణసత్య (1971)
భార్యాబిడ్డలు(1972)
డాక్టర్ బాబు (1973)
దేవుడమ్మ (1973)
దేవుడు చేసిన మనుషులు (1973)
లోకం చుట్టిన వీరుడు(1973)
ప్రేమలు - పెళ్ళిళ్ళు(1974)
 
జయలలిత తొలి సినిమా " చిన్నడ గొంబె కన్నడ "  చిత్రము పెద్ద హిట్టయ్యింది. ఈమె తొలి తెలుగు సినిమా 
" మనుషులు మమతలు " ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతో సత్కరించింది. ఈమె అవివాహిత గానే జీవితాన్ని గడిపారు. జయలలితపై ఎన్నో రకాలైన కేసులు పెట్టినా, ఎదురు నిలిచి పోరాడారు. ఆమె మీద పెట్టిన 11 కేసులలో తొమ్మిది కేసులు పూర్తి అయ్యాయి. మిగిలిన రెండు కేసులలో ఆమె పోరాడుతుంది.
 
* 1988లో రాజ్యసభకు నామినేట్ చేయబడింది.
* 1989 గెలుపు,
* 1991 గెలుపు.
* 1996లో జయలలితపై వచ్చిన కొన్ని అభియోగాలు కారణంగా ఓడిపోయిన ఆమె పార్టీ (1996 ఓటమి),
* (2001 గెలుపు)
* 2001లో అత్యధిక మెజారిటీతో గెలిచింది.
* 2006 లో ఓటమి.
* 2011లో తిరుగులేని ఎన్నిక.
* 2016లో కూడా విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణము చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments