Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ చివరి కోరిక అదే.. అజితే అన్నాడీఎంకే పగ్గాలు చేపడతాడా? పన్నీర్ ఆ పని చేస్తారా?

అన్నాడీఎంకే పార్టీ అధినేత జయలలిత వారసుడిగా అన్నాడీఎంకే పగ్గాలు ఎవరు చేపడతారనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. అమ్మ కన్నుమూయడంతో జయలలిత వారసుడిగా సినీ నటుడు అజిత్ తెరపైకి వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు బ

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2016 (08:36 IST)
అన్నాడీఎంకే పార్టీ అధినేత జయలలిత వారసుడిగా అన్నాడీఎంకే పగ్గాలు ఎవరు చేపడతారనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. అమ్మ కన్నుమూయడంతో జయలలిత వారసుడిగా సినీ నటుడు అజిత్ తెరపైకి వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో తన వారసుడిని జయలలిత ఎప్పుడో ఎంపిక చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. సినీ నటుడు అజిత్ ఆమెను 'అమ్మ' అని పిలుస్తూ ఉంటారు. 
 
పొయెస్‌ గార్డెన్‌కు నేరుగా చేరుకునే అతి కొద్ది మంది వ్యక్తుల్లో అజిత్ కూడా ఒకరు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే చీలిపోకుండా యధాతథంగా కొనసాగాలని.. బలమైన ప్రత్యర్థిగా ఉన్న డీఎంకేకు గట్టిపోటీ ఇవ్వాలని అజిత్ వంటి వ్యక్తిని వారసుడిగా తెరపైకి రావడమే మంచిదని టాక్ వస్తోంది. అన్నాడీఎంకేకు తిరుగులేని శక్తిగా మారిన అమ్మకు వారసుడిగా అజిత్‌ను ప్రకటించాలని.. అన్నాడీఎంకే పార్టీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. 
 
డీఎంకేలో కరుణానిధి, ఆయన తనయుడు స్టాలిన్‌ రూపంలో బలమైన నాయకత్వం ఉన్నప్పుడు జయ తర్వాత అంతే బలమైన నాయకత్వం లేకపోతే, తమిళ రాజకీయాల్లో అన్నాడీఎంకే నిలదొక్కుకోవడం కష్టమనే అంచనాలూ వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో, తమిళనాట ప్రజాకర్షణ కలిగిన అజిత్ అయితేనే పార్టీని కొనసాగించగలరని అంటున్నారు. జయలలిత, రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ప్రజాదరణ అజిత్ సొంతమని చెబుతున్నారు. 
 
జయలలిత కూడా ఇదే విషయాన్ని పార్టీ వర్గాలకు స్పష్టం చేశారని, పన్నీరు సెల్వం అజిత్‌కు చేదోడు వాదోడుగా ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన మరణానంతరం పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా ఉండాలని, తదుపరి ఎన్నికలు వచ్చే నాటికి అజిత్‌ను నాయకుడిగా తయారు చేయాలని అమ్మ తన నమ్మినబంటు పన్నీర్ సెల్వంతో చెప్పినట్లు సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ధోనీ!

Dr. Mohanbabu: మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహ దేవ శాస్త్రి పరిచయ గీతం విడుదల

Balakrishna: బాలకృష్ణ నటించిన టైమ్ ట్రావెల్ చిత్రం ఆదిత్య 369 రీ రిలీజ్

Sushanth: రెండు డిఫరెంట్ లుక్‌లలో సుశాంత్ అనుమోలు కొత్త సినిమా పోస్టర్

దసరాకు సీజన్‌లో విడుదలయ్యే తెలుగు చిత్రాలేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments