Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్లికట్టు అంటే తెలుసా..! నిషేధించినా ఆపరా...! సిద్ధమవుతున్న రంగంపేట

పండగంటే పండగ. అందులోనూ సంక్రాంతి పండుగ అంటే ఆ మజానేవేరు. కొత్త బట్టలు, పిండివంటలు, గొబ్బెమ్మలు. ఇవన్నీ మూమూలే. అంతటితో ఆగితే సరదా ఏముంటుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో పందెం కోళ్లకు రంగంలోకి దించుతారు.

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (12:17 IST)
పండగంటే పండగ. అందులోనూ సంక్రాంతి పండుగ అంటే ఆ మజానేవేరు. కొత్త బట్టలు, పిండివంటలు, గొబ్బెమ్మలు. ఇవన్నీ మూమూలే. అంతటితో ఆగితే సరదా ఏముంటుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో పందెం కోళ్లకు రంగంలోకి దించుతారు. మరికొన్ని ప్రాంతాల్ల కోడెద్దులతో కయ్యానికి కాలు దువ్వుతారు. మరో ప్రాంతంలో వేగంగా వేళ్లే ఆవులను, ఎద్దులను అడ్డపడి అదుపు చేస్తారు. అలా చేసిన వారే ఆ ఊరికి మొనగాని అర్థం. అలాగని ఇదేదో పోటీలాగా నిర్వహిస్తే ఫర్వాలేదు. ఊరు ఊరంతా ఇందులో పాల్గొంటారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చు. కానీ ఆ ఆట లేనిది వారు జరుపుకునే పండగకు నిండుదనం రాదంటారు. అలాంటి సాంప్రదాయానికి చిత్తూరు జిల్లా రంగంపేట మరో సారి వేదిక కాబోతుంది. 
 
పండగంటే గంగిరెద్దులే చాలా మందికి గుర్తుకు వస్తాయి. కానీ కయ్యానికి కాలుదువ్వే ఎద్దులనే ఇక్కడివారు ఎక్కువగా ఇష్టపడతారు. వాటితో సై అంటే సై అంటారు. ఒకటికాదు రెండు కాదు వందల సంఖ్యలో ఆవులను, లేగదూడలను, ఎద్దులను సందులోకి వదుతారు. అదేదో సినిమాల్లో సీమ సందుల్లోకిరారా చూసుకుందాం అంటారుగా.. అచ్చం అలాగే సందుల్లోకి వీటిని వదిలి వేగంగా పరెత్తే సమయంలో నిలువరించడానికి ప్రయత్నిస్తారు. 
 
ఒక రకంగా ప్రాణాలతో చెలగాటమే అయినా అదే వారికి ఎక్కువ మజానిస్తుంది. వారి పండగకు ప్రత్యేకను చేకూర్చుతుంది. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి ఆచారాన్ని ప్రతి సంక్రాంతికి తూచా తప్పకుండా పాటిస్తున్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులు కూడా మందలించినప్పటికీ, దానికి దూరంగా జరగడానికి వారికి మనసొప్పడం లేదు. పెద్దల వారసత్వం పోతుందనో, లేక జల్లికట్టులో వాళ్ల ఊరికి ఉండే ప్రత్యేక పోతుందో కానీ, మొత్తానికి సంక్రాంతి పండగ అంటే జట్టు హాట్ టాపిక్. 
 
కోనసీమ జిల్లాలోల్లో కోడి పందేలు ఎలా హాట్ టాపికో.. ఇక్కడ జల్లికట్టు అలా అనమాట. మళ్లీ సంక్రాంతి రానే వచ్చింది. ఎద్దులను సిద్ధం చేస్తున్నారు. వాటి కొమ్ములకు పదును పెడుతున్నారు. అందంగా అలంకరిస్తున్నారు. అలా పదునుగా ఉండే కొమ్ములకు ఒక పలకను కట్టి వాటిని మందలో పరెగెత్తిస్తారు. అలా పరిగెత్తే టైంలో వాటిని నిలువరించి ఆ కొమ్ములకు ఉండే పలకను తీసుకోవాలి. అది మొత్తానికి పందెంలో రూపంలో చెప్పాలంటే జల్లికట్టు కథ. 
 
జల్లికట్టు గ్రామస్తులకు ఉత్సాహం తెప్పించినా జంతుప్రేమికులకు మాత్రం ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. నోరులేని జీవాలను జనం మధ్యలోకి వదిలి పట్టుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు జంతు ప్రేమికులు. జల్లికట్లుపై నిషేధం పెట్టినా ప్రభుత్వం మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు. 
 
ఇప్పటికే జల్లికట్లును నిషేధించినా గ్రామాల్లో మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. గాయాలపాలైనా, ప్రాణాలు పోయినా సరే లెక్కచెయ్యకుండా జల్లికట్టులో పాల్గొంటున్నారు. పశువులను తరమడం, వాటి నెత్తిపై కట్టిన బహుమతులను పొందడం ఇలాంటివి చేస్తూనే ఉన్నారు. మరికొన్ని రోజుల్లో చిత్తూరు జిల్లా రంగంపేటలో ఈ జల్లికట్టు జరుగనుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments