Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి.. మావి చిన్న ప్రాణాలు.. జబర్దస్త్ నటులు

సెల్వి
సోమవారం, 6 మే 2024 (12:19 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కేడర్‌తో పాటు మెగా కుటుంబం అవిశ్రాంతంగా శ్రమిస్తోంది. అయితే పవన్ కోసం జబర్దస్త్ బ్యాచ్ గెటప్ శ్రీను, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ తదితరులు కూడా తిరుగుతున్నారు. కానీ వైసీపీ నుంచి వీరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
పెయిడ్ బ్యాచ్ అని, ఎపిసోడ్‌లు, కాల్షీట్లు లెక్కన లక్షల్లో రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విమర్శలను గెటప్ శ్రీను తిప్పికొట్టారు. పిఠాపురంలో జబర్దస్త్ కామెడీ షోలోని సభ్యులు ప్రచారం చేయడంపై వైసీపీ నేతలు ఆరోపణలు గెటప్ శ్రీను తోసిపుచ్చారు. 
 
రోజు వారీ కాల్షీట్ల ప్రకారం ప్రచారం చేశారు. మా కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మా ప్రచారం కోసం డబ్బులు ఇచ్చారు అనే విమర్శల్లో పసలేదు. కావాలంటే మా బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి అంటూ సవాల్ విసిరారు.
 
దీనికి గెటప్ శ్రీను బదులిస్తూ.. తమను ఎవరు పిలవలేదని, స్వచ్ఛందంగానే ప్రచారం చేస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టంతోనే ఇంత కష్టపడుతున్నామని తెలిపారు. మేం ప్రచారానికి వస్తామని అడిగితే.. వారే ఒక డేట్ ఇచ్చి రమ్మన్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు. 
 
ఇక జనసేన నుంచి డబ్బులు అందాయన్న విమర్శలకు కూడా తనదైన శైలిలో కౌంటరిచ్చారు శ్రీను. ఇంటికి వచ్చి సోదాలు చేసుకోవచ్చని.. కావాలంటే మా అకౌంట్ నెంబర్లు కూడా ఇస్తామని, అసలు డబ్బులు పడ్డాయో లేదో తెలుస్తుందన్నారు. 
 
మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో అవకాశాలు రావన్న మంత్రి రోజా వ్యాఖ్యలపైనా గెటప్ శ్రీను స్పందించారు. రోజా మావి చిన్న ప్రాణాలు అన్నారని, అవి చిన్న కామెంట్స్‌లానే తీసుకుంటానని స్పష్టం చేశారు. తాను మెగా ఫ్యామిలీతోనే కాదు.. ఎన్టీఆర్, వెంకటేష్, నాని లాంటి స్టార్స్‌తోనూ సినిమాలు చేశానని శ్రీను క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments