Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే.. ఎనీ డౌట్స్ : నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

ఠాగూర్
సోమవారం, 6 మే 2024 (12:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాజంపేట లోక్‌సభ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన ఆయన ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రాజంపేట అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో జగన్ పాలనలో ఇసుక మాఫియా, దేవుని భూముల కబ్జా, దోపిడీలు భారీగా జరిగాయని ఆరోపించారు. తంబళ్లపల్లెలో గర్భిణీపై వైకాపా శ్రేణులు దాడి చేయడం అమానుష చర్యగా ఆయన వ్యాఖ్యానించారు. 
 
పోలీసులు కూడా కాస్త ఓవరాక్షన్ తగ్గించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో మున్ముందు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పైగా, పోలీసులకు జగన్ ఏమైనా మంచి చేశారా అని ప్రశ్నించారు. ఓటర్లందరూ ధైర్యంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర బలగాలు అందరికీ రక్షణగా ఉంటాయని చెప్పారు. 2036 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కెమెరాలతో నిఘా ఉంటుందని వెల్లించారు. రాష్ట్రాన్ని అని విధాలుగా భ్రష్టు పట్టించిన వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతారని కిరణ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments