Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు క్రొత్తలేమున్నవి... వెనుకటి రాజకీయాలే పునరావృతం... కాంగ్రెస్ గగ్గోలు పెట్టినా...

తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల ప్రకారం మణిపూర్, గోవాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నైతికత భారతీయ జనతాపార్టీకి ఏమాత్రం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కేంద్రంలో ఉన్న అధికారాన్ని వినియోగించి ప్రజా అభిప్రాయానికి పాతర వేసిన ఘనులం మేమే అనే రీతిగా మో

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (12:49 IST)
తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల ప్రకారం మణిపూర్, గోవాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నైతికత భారతీయ జనతాపార్టీకి ఏమాత్రం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కేంద్రంలో ఉన్న అధికారాన్ని వినియోగించి ప్రజా అభిప్రాయానికి పాతర వేసిన ఘనులం మేమే అనే రీతిగా మోడీ మంత్రం... అమిత్ షా ద్వయం పనిచేస్తోందంటూ వారు మండిపడుతున్నారు. 
 
ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ దొడ్డిదారిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితికి చేరుకుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మణిపూర్ అసెంబ్లీలో 60 స్థానాలు వుంటే బీజేపీ గెలుపొందింది కేవలం 21 స్థానాలలో మాత్రమే. కాంగ్రెస్ పార్టీ 28 స్థానాలలో విజయం సాధించింది. ఇతరులు 11 స్థానాలలో గెలుపొందారు. ప్రజలు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని పెద్ద పార్టీగా నిలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస సంఖ్య 31ని ఏ పార్టీ కూడా సాధించలేకపోయింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కాంగ్రెస్‌ను పిలవాల్సి ఉంది. 

కానీ గవర్నర్‌ కాంగ్రెస్ పార్టీని కాకుండా రెండో స్థానంలో వున్న భాజపాను పిలవడం వివాదాస్పదంగా మారింది. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగానే ప్రభుత్వ ఏర్పాటు జరుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోంది. ఇక గోవా విషయానికి వస్తే గోవా శాసనసభలో 40 స్థానాలున్నాయి. ఇక్కడ గతంలో బీజేపీనే అధికారంలో ఉండేది. 
 
అయితే తాజాగా జరిగిన ఎన్నికలలో ఆ పార్టీకి కేవలం 13 స్థానాలు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు వచ్చాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 21గా ఉంది. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ నాలుగడుగుల దూరంలో ఉంటే బీజేపీ ఏడడగుల దూరంలో ఉంది. ఇక్కడ కూడా భాజపా అధికారం పీఠాన్ని అధిష్టించనుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లినా అక్కడ ఆ పార్టీకి చుక్కెదురైంది. మీకు సంఖ్యాబలం వుంటే రాష్ట్ర గవర్నర్ కు చూపించవచ్చని పేర్కొంటూనే, భాజపా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ప్రభుత్వానికి అడ్డు చెప్పేది లేదంటూ తేల్చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments