Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమా నాగిరెడ్డి మృతికి టీడీపీనే కారణం.. మోసం చేసిన వారితో సంతాప తీర్మానమా.. నో?

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి తెలుగుదేశం పార్టీనే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపించింది. అందువల్లే తాము ఆ పార్టీతో కలిసి సంతాప తీర్మానం చేయదలచుకోలేదని ఆ పార్టీ విప్ పిన్నె

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (12:17 IST)
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి తెలుగుదేశం పార్టీనే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపించింది. అందువల్లే తాము ఆ పార్టీతో కలిసి సంతాప తీర్మానం చేయదలచుకోలేదని ఆ పార్టీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మరో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి మాట్లాడుతూ భూమాను తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాక మానసిక సంక్షోబానికి గురయ్యారని తెలిపారు. మానసిక క్షోభకు గురి చేయడం చంద్రబాబుకు అలవాటేనని, గతంలో ఎన్టీఆర్‌ను, ఇప్పుడు భూమా నాగిరెడ్డికి అలాగే చేశారన్నారు. టీడీపీలో చేరిన కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే ఉందని తెలిపారు. 
 
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఆశ చూపి... ఇవ్వకపోవడం వల్లే మనస్థాపానికి గురై ఆ క్షోభతోనే ఆయన ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చారు. భూమాను మోసం చేసిన వారితో సంతాప కార్యక్రమ తీర్మానంలో పాల్గొనకూడదని పార్టీ నిర్ణయించిందని చెప్పుకొచ్చారు. 
 
ఇదిలా ఉంటే.. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతికి ఆయనలోని నిరాశా నిస్పృహలే కారణమని.. కేబినెట్ పోస్టు ఇవ్వరని తేలాకే.. మానసిక క్షోభతో కళ్లు మూశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముందు నుంచి చంద్రబాబు హామీ ఇచ్చారని.. కానీ ఈ విషయమై గవర్నర్ నరసింహన్ వద్ద చంద్రబాబు ప్రస్తావించినప్పుడు. పార్టీ ఫిరాయించిన వ్యక్తులకు మంత్రి పదవినిస్తే సాంకేతికంగా కూడా చిక్కులు వస్తాయని గవర్నర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని సన్నిహితులు చెప్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ల‌ ఒసేయ్ అరుంధతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments