Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం.. ఏడాదిలో ఒక్కరోజైనా వారి ఆశలకు..?

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (13:21 IST)
Parents Day
ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం నేడు. ఈ రోజు తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం వారి వారి ఆశలను నెరవేర్చేందుకు ఉద్దేశించింది. ఉద్యోగాలు, వ్యాపారాలు రీత్యా బిడ్డలు వదిలి వెళ్లిపోతుంటే ఒంటరిగా బతకలేక తల్లిదండ్రులు కఠిన పరీక్షలు ఎదుర్కొంటారు. ఈ క్రమంలో వారు పిల్లలతో ఉందామని ఆశపడతారు. కానీ వారి కోరిక నేరవేరదు. దీంతో మానసిక వ్యాధికి గురవుతుంటారు. ఇటువంటివారి వేదనను గుర్తించి ఏడాదిలో ఒక్కరోజైనా వారి ఆశను నేరవేర్చడానికి ఏర్పాటైందే ఈ తల్లిదండ్రుల దినోత్సవం. 
 
ఈ యాంత్రిక జీవనంలో పిల్ల‌లు త‌మ త‌ల్లిదండ్రుల‌ను వృద్ధాప్యంలో వారిని నిర్లక్ష్య చేయ‌కుండా, వృద్ధాశ్రమాలకు తరలించి చేతులు దులుపుకోకుండా వారికి సేవ‌లు చేయ‌డం, మ‌న భ‌విష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారి ప‌ట్ల బాధ్యత‌యుతంగా ఉండేలా చేయ‌డం, అంద‌రూ త‌మ త‌ల్లిదండ్రుల‌ను పేమానురాగాల‌తో చూసుకునేలా చేయ‌డం మొద‌లైన‌వి ఈ దినో‌త్స‌వం ముఖ్యోద్దేశాలు.
 
ప్రపంచ త‌ల్లిదండ్రుల దినోత్సవాన్ని 2012లో యూఎన్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీ తీర్మానం చేసింది. త‌ల్లిదండ్రుల దినోత్స‌వాన్ని నిర్వహించాల‌న్న ప్రతిపాద‌న అమెరికాలో మొద‌లైంది. 1984లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింట‌న్ అధికారికంగా ఈ దినోత్సవానికి ఆమోద ముద్రవేశారు. దీంతో అప్ప‌టి నుంచి త‌ల్లిదండ్రుల దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు నిర్వహిస్తున్నాయి. వివిధ దేశాల్లో ఈ దినోత్సవాన్ని వేరువేరు తేదిల్లో జ‌రుపుకుంటారు. త‌ల్లిదండ్రుల విష‌యంలో ఎటువంటి భేదం ఉండ‌కూడ‌ద‌ని సుప్రీం కోర్టు ఆదేశించ‌డంతో పేరెంట్స్ డే ప్రపంచ‌వ్యాప్తంగా విస్తరించింది.
 
ప్రస్తుతం ఈ కోవిడ్ 19 మ‌హ‌మ్మారి స‌మ‌యంలో త‌ల్లిదండ్రుల త‌మ పిల్ల‌ల విష‌యంలో తీసుకుంటున్న జాగ్రత్త‌లు, వారి ప‌ట్ట వ‌హిస్తున్న శ్రద్ధ అభినంద‌నీయం. ఇలాంటి ఆప‌ద స‌మ‌యంలో కుటుంబం ఆస‌రా, త‌ల్లిదండ్రుల త‌మ పిల్ల‌ల ప‌ట్ల వ‌హించే బాధ్యత‌ల‌ను, త‌ల్లిదండ్రుల గొప్పద‌నాన్ని ప్రపంచానికి తెలియ‌జేయ‌డ‌మే కాక గుర్తించేలా చేసింది ఈ పారెంట్స్ డే. తల్లిదండ్రుల అందరికీ పారెంట్స్ డే శుభాకాంక్షలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments