Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లధనం అంతా గంగపాలు కాలేదు... బ్యాంకుపాలు అయింది...దొడ్డిదారిన నల్లనోట్లు తెల్లనోట్లుగా...

నల్లధనాన్ని అంతా నల్ల కుబేరులు గంగపాలు చేసుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు కానీ... వాస్తవ పరిస్థితి అలా కన్పించడంలేదు. నోట్ల మార్పిడి పద్ధతితోపాటు నల్ల కుబేరులకు కొందరు బ్యాంకు సిబ్బంది సహకరించడంతో అత్యధిక శాతం నల్ల డబ్బు తెల్ల డబ్బుగా

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (17:15 IST)
నల్లధనాన్ని అంతా నల్ల కుబేరులు గంగపాలు చేసుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు కానీ... వాస్తవ పరిస్థితి అలా కన్పించడంలేదు. నోట్ల మార్పిడి పద్ధతితోపాటు నల్ల కుబేరులకు కొందరు బ్యాంకు సిబ్బంది సహకరించడంతో అత్యధిక శాతం నల్ల డబ్బు తెల్ల డబ్బుగా మారిపోయిందంటున్నారు. 100కి 30 శాతం కమిషన్ చొప్పున కొన్ని బ్యాంకుల్లో సిబ్బంది దగ్గరుండి మరీ ఈ తంతు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల అక్రమాలకు పాల్పడిన బ్యాంకు సిబ్బందిని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. ఐతే దృష్టికి రానివి ఎన్నో కదా.
 
పేరుమోసిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన వద్ద ఉన్న బ్లాక్ మనీ ఏం చేశారని అడిగితే... చెయ్యాల్సిన రూటులో వైట్ చేసేసుకున్నామని చెప్పడం కొసమెరుపు. ఈ లెక్కన దేశంలో నేలమాళిగల్లో దాచుకున్న నల్ల డబ్బును దాచుకున్న కుబేరులంతా హేపీగా నల్లధనాన్ని వైట్ మనీగా మార్చేసుకున్నారని అనుకోవచ్చు.
 
నోట్ల మార్పిడి తంతు నిన్నటితో పూర్తయిన నేపద్యంలో ఈ ప్రక్రియలోనే బ్లాక్ మనీ కోట్లకొద్దీ మారిపోయిందని అంటున్నారు. ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి చూపిస్తే రూ. 4500 పాతనోట్లను మార్చుకోవచ్చని పెట్టిన నిబంధనను ఆసరా చేసుకుని కోట్లకొద్ది నల్లధనం మార్చేసినట్లు తెలుస్తోంది. వేలికిపైన ఇంకు చుక్క పెట్టే నాటికే జరగాల్సినదంతా జరిగిపోయిందని అంటున్నారు. ఎవరో ఈ గిమ్మిక్కులు తెలియని కొందరు మాత్రమే నల్లధనాన్ని వృధాగా రోడ్లపైనో, దేవుడు హుండీల్లోనో వేసి చేతులు దులుపుకున్నారనీ, అత్యధికులు మాత్రం ఆర్బీఐ చూపించిన మార్గాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నారని అంటున్నారు. 
 
మరి వరసబెట్టి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేసినవారిని ఎలా పట్టుకుంటారో చూడాల్సిందే. ఎందుకంటే కోట్లకొద్దీ డబ్బూ... ఆ డబ్బును మార్చిన కోట్లమంది. కోట్లలో ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు... ఇవన్నీ తనిఖీ చేసి పట్టుకోవాలంటే కుదురుతుందా. ఒకవేళ కుదిరినా ఎన్నాళ్లకు.. ఎన్ని రోజులకు...? ఒక్క మాటలో చెప్పాలంటే క్సెరాక్స్ కాపీ ఆధార్... ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ చూపించి డబ్బు మార్చుకున్నవారూ ఉన్నారు. అలాంటి పత్రాలను బ్యాంకు సిబ్బంది గట్టిగా తనిఖీ చేసే పరిస్థితి కూడా లేదు. వాళ్లు తనిఖీ చేసేవరకూ ప్రజలు ఆగడంలేదు మరి... మొత్తమ్మీద నోట్ల మార్పిడి అలా జరిగిపోయింది... అంతా వైట్‌గా...
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments