Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌కు మోదీ మరో షాక్... సింధు జలాలు పాకిస్తాన్‌కు వెళ్లనివ్వం... పాక్ గిలగిల...

పొద్దస్తమానం భారతదేశంలో ఏదో ఒక దుశ్చర్యకు పాల్పడేలా ప్రేరేపిత ఉగ్రవాదులను రెచ్చగొట్టే పాకిస్తాన్ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ షాక్ ఇచ్చారు. సింధు నది జలాలను పాకిస్తాన్‌కు వెళ్లనీయబోమన్నారు. ఆ నదిపైన భారతదేశానికి హక్కులు ఉన్నాయనీ, నదీ జలాలన

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (16:12 IST)
పొద్దస్తమానం భారతదేశంలో ఏదో ఒక దుశ్చర్యకు పాల్పడేలా ప్రేరేపిత ఉగ్రవాదులను రెచ్చగొట్టే పాకిస్తాన్ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ షాక్ ఇచ్చారు. సింధు నది జలాలను పాకిస్తాన్‌కు వెళ్లనీయబోమన్నారు. ఆ నదిపైన భారతదేశానికి హక్కులు ఉన్నాయనీ, నదీ జలాలను వాడుకునే హక్కు భారతదేశానికి పూర్తిగా ఉన్నదని ఆయన వెల్లడించారు. 
 
సింధు జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయనీ, వాటిని సక్రమంగా వాడుకుంటామని అన్నారు. శుక్రవారం నాడు ఆయన పంజాబ్ రాష్ట్రంలోని భటిండాలో ఎయిమ్స్ శంకుస్థాపన సందర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కాగా 1960లో ఇండస్ ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులు మన దేశానికి చెందగా ఇండస్(సింధు), జీలం, చీనాబ్ నదులు పాకిస్తాన్ దేశానికి దక్కాయి. 
 
కాగా భారతదేశం నుంచి పాకిస్తాన్ దేశంలో ప్రవహించే ఈ నదీ జలాలను భారత్ అడ్డుకట్టవేస్తే పాకిస్తాన్ దేశం మలమలమాడుతుంది. నీరు లేక అక్కడి భూములు బీడువారుతాయి. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలంటే ఇంతకుమించి మరో మార్గం లేదని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments