Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరి జేబుల్లో అమ్మ బొమ్మ కాదు చిన్నమ్మ... 'అమ్మ' దీవెనలు ఉన్నట్లేనా? ఏడాది తిరక్కుండానే అంటూ...

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత ఆకస్మిక మృతి తర్వాత అనేక రాజకీయ పరిణామాల అనంతరం చిన్నమ్మ శశికళకు గురువారం పార్టీ పగ్గాలు దక్కాయి. గురువారం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు పలువురు మంత్రులు పోయెస్ గార్

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (19:08 IST)
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత ఆకస్మిక మృతి తర్వాత అనేక రాజకీయ పరిణామాల అనంతరం చిన్నమ్మ శశికళకు గురువారం పార్టీ పగ్గాలు దక్కాయి. గురువారం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు పలువురు మంత్రులు పోయెస్ గార్డెన్ చేరుకుని అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే చిన్నమ్మ శశికళ దగ్గరకు వెళ్లిన పార్టీ నాయకులను చూసిన కార్యకర్తలు షాకైయ్యారు.


జయలలిత ఉన్న సమయంలో ఆమె దగ్గరకు వెళ్లి పలుకరించాలన్నా, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకోవాలన్నా నాయకులు వారి షర్టు జేబులో కచ్చితంగా అమ్మ జయలలిత ఫోటో పెట్టుకునేవారు. అది పార్టీ సాంప్రదాయంగా వచ్చేసింది.
 
గురువారం అన్నాడీఎంకే చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన తరువాత శశికళ దగ్గరకు వెళ్లిన నాయకుల జేబులో అమ్మ జయలలిత ఫోటో మాయమైపోయింది. చిన్నమ్మ ఫోటో వచ్చేసింది. అదేంటంటే? పార్టీ చీఫ్ ప్రస్తుతం చిన్నమ్మే కదా అంటూ చెప్తున్నారు. అంతేగాకుండా.. అమ్మ బ్యానర్లు చాలామటుకు కనుమరుగైనాయి.  చెన్నైలో కొన్నిచోట్ల అమ్మ ఫోటో కింద.. చిన్నమ్మ ఫోటో పైన గల బ్యానర్లు వెలిశాయి. అయితే అమ్మను అప్పుడే చులకన చేసేసిన వైనం అన్నాడీఎంకే కార్యకర్తలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. మరోవైపు చిన్నమ్మకు పగ్గాలు అప్పగించడం కొందరు ఎమ్మెల్యేలకు ఇష్టం లేదనీ, ఏడాది తిరక్కుండానే పార్టీ తల్లకిందులవుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి, అమ్మ అత్యంత శక్తివంతంగా నడిపిన అన్నాడీఎంకే పార్టీ భవిష్యత్తు చిన్నమ్మ చేతుల్లో ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments