Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో మోసం.. గర్భవతిని కదిలే రైలు నుంచి తోసేశాడు.. కుడిచేయిని కోల్పోయి...

ప్రేమ పేరుతో మోసం చేశాడు. గర్భవతిని చేశాడు. పెళ్ళి చేసుకోమంటే పొమ్మన్నాడు. దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. గర్భవతి అయిన ప్రేయసిని క్షమించమని అడిగి నటించాడు. దాన్ని నమ్మి ప్రేయసి ఫిర్యాద

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (17:57 IST)
ప్రేమ పేరుతో మోసం చేశాడు. గర్భవతిని చేశాడు. పెళ్ళి చేసుకోమంటే పొమ్మన్నాడు. దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. గర్భవతి అయిన ప్రేయసిని క్షమించమని అడిగి నటించాడు. దాన్ని నమ్మి ప్రేయసి ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. అయితే ఆ ప్రేయసిని చంపేందుకు ప్రియుడు కుట్ర పన్నాడు. ఈ క్రమంలో గర్భవతి అనే కనికరం లేకుండా కదిలే రైలు నుంచే తోసేశాడు. ఈ ఘటన కోల్‌క‌తాలోని మాల్దా రైల్వే స్టేషన్ ప‌రిధిలో చోటుచేసుకుంది. 
 
మాల్దా నుంచి శంసీ స్టేషన్‌కు వెళుతున్న కతిహార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఓ వ్య‌క్తి గర్భవతైన తన ప్రియురాలిని రైలు నుంచి బయటకు నెట్టేశాడు. ఆ స‌మ‌యంలో ఆమె చేసిన ఆర్తనాదాలు విన్న రైల్వే పోలీసు అధికారులు రైల్వే పట్టాలపై ఆమె ప‌డి ప్రాణాపాయ స్థితిలో ఉండ‌డాన్ని గ‌మ‌నించారు. వెంట‌నే ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కానీ బాధితురాలు కుడిచేయి కోల్పోయిందని.. తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
 
దీంతో బాధితురాలి కుటుంబ స‌భ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే, స‌ద‌రు నిందితుడిపై ఇంకో కేసు కూడా ఉందని.. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం