Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్‌ను పవర్ స్టార్ మించాడా..? 20 ఏళ్ళ పవన్ సినీ కెరీర్ పైన...

పవన్‌ కళ్యాణ్‌.. ఈ పేరు చిరంజీవి తర్వాత విన్పించేది. అప్పట్లో చిరంజీవి పేరు వుపయోగించుకుని సినీ రంగంలోకి వచ్చినా.. ఆ తర్వాత స్వంతంగా ఎదిగిన కెరటం పవన్‌ కళ్యాణ్‌. దసరాతో సినీ ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్ళు. పవన

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (12:34 IST)
పవన్‌ కళ్యాణ్‌.. ఈ పేరు చిరంజీవి తర్వాత విన్పించేది. అప్పట్లో చిరంజీవి పేరు వుపయోగించుకుని సినీ రంగంలోకి వచ్చినా.. ఆ తర్వాత స్వంతంగా ఎదిగిన కెరటం పవన్‌ కళ్యాణ్‌. దసరాతో సినీ ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్ళు. పవన్‌ అభిమానులంతా సంబరాలు చేసుకుంటూ తమ అభిమాన హీరో సినిమాలను తల్చుకుంటున్నారు. తొలిప్రేమ, ఖుషీ, గబ్బర్‌ సింగ్‌, అత్తారింటికి దారేది వంటి చిత్రాలతో ఇమేజ్‌ను సంపాదించుకున్న పవన్‌.. ఏకంగా రాజకీయాలల్లో కీలక వ్యక్తిగా మారాడు. తూర్పు గోదావరి ప్రజలు పవన్‌ పోస్టర్‌ను వెరైటీగా తయారుచేసి సంబరాలు జరుపుకున్నారు.
 
కాగా ,ఒక్కసారి ఆయన కెరీర్‌ను పరిశీలిస్తే ఎన్నో విషయాలు ఆసక్తికరంగా వుంటాయి. ఈ ఇరవై ఏళ్ళల్లో చిరు సోదరుడిగా పవన్‌ సాధించింది ఏంటి? అని పరిశీలిస్తే... దానికి సమాధానం 'చాలానే' అని వస్తుంది. భారీ అంచనాల నడుమ వచ్చిన పవన్‌, తొలినాళ్ళలో మెగా అభిమానులను ఆకట్టుకోనప్పటికీ, అంచలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు.   టాలీవుడ్‌కు 'పవర్‌ హబ్‌'గా మారిపోయారు. 
 
ఒకప్పుడు ఇండస్ట్రీలో అంతా మెగాస్టార్‌ నామ జపం చేసేవారు, కానీ ప్రస్తుతం మెగాస్టార్‌ ఉండగానే, పవన్‌ నామ జపం చేస్తున్నారంటే ఏ విధమైన ప్రభావం చూపించాడో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇదేదో ఒక్కరోజులో జరిగింది కాదు. అయితే.. నటునితో పాటు వ్యక్తిత్వం ఆయనకు విశేషమైన సంఖ్యలో అభిమాన గణాన్ని తెచ్చిపెట్టింది. అదే ఇతర హీరోల నుండి పవన్‌ను వేరుచేసింది. అదే రాజకీయ పార్టీని పవన్‌ స్వయంగా నడిపించుకునేటంత. 'పవర్‌ స్టార్‌' నుండి 'జనసేన' అధినేతగా మారిన వైనం అందరికీ ఆదర్శప్రాయం. 
 
అలాగే ఒక సినీ 'వారసుడి'గా ఎంట్రీ ఇచ్చి, ఆ 'వారసత్వం' అనే మాటను మరిచిపోయేటంతగా పవన్‌ ప్రభావం ప్రేక్షకులపై పడింది. రాజకీయాల్లో సమూల మార్పు కోసం తన జీవితాన్ని కేటాయిస్తానని, రాబోయే తరం కోసమే తన రాజకీయ జీవితం అంకితమంటూ పవన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే వెంటవెంటనే ఈ ఏడాది మూడు సినిమాలు చేసేసి.. అవి వచ్చే ఏడాది రిలీజుకు సిద్ధమయిన తర్వాత రాజకీయాలపై దృష్టి సారిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయ ముఖచిత్రం ఎలా వుంటుందో.. ప్రజలకు ఏమి మేలు చేస్తారో చూడాల్సిందే.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments