Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేర‌ళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ... సాధార‌ణ ప్ర‌యాణికుడిలా రైలులో ఇలా...

తిరువ‌నంత‌పురం : ఛోటామోటా నాయకులే కాదు.. మాజీ ఎమ్మెల్యేలు కూడా తమకు తాము వీఐపీలుగా భావించుకుంటూ, విలాసాలు కోరుతున్న రోజులివి. ఇలాంటి సమయంలో ఓ మాజీ ముఖ్యమంత్రి అతి సాధారణ వ్యక్తిలాగా స్లీపర్‌ క్లాస్‌ రైలు కపార్ట్‌మెంట్‌లో ప్రయాణించారు. ఎవరూ ఊహించని రీ

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (12:31 IST)
తిరువ‌నంత‌పురం : ఛోటామోటా నాయకులే కాదు.. మాజీ ఎమ్మెల్యేలు కూడా తమకు తాము వీఐపీలుగా భావించుకుంటూ, విలాసాలు కోరుతున్న రోజులివి. ఇలాంటి సమయంలో ఓ మాజీ ముఖ్యమంత్రి అతి సాధారణ వ్యక్తిలాగా స్లీపర్‌ క్లాస్‌ రైలు కపార్ట్‌మెంట్‌లో ప్రయాణించారు. ఎవరూ ఊహించని రీతిలో 160 కిలోమీటర్లు మామూలు బోగీలో ప్రయాణించి.. తోటి ప్రయాణికులతో మమేకమయ్యారు. 
 
డాబూ, దర్పాలకు పోకుండా సామాన్యులతో మమేకమై.. సామాన్యుడిలా ఆయన చేసిన ప్రయాణంపై ఇప్పుడు సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయనే కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ. మొన్నటివరకు సీఎం పదవిలో ఉన్న ఈ కాంగ్రెస్‌ నాయకుడు స్లీపర్‌ క్లాస్‌ కపార్ట్‌మెంట్‌లో 160 కిలోమీటర్లు ప్రయాణించి కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకున్నారు.
 
సోషల్‌ మీడియాలో ఆయన నిరాడంబర ప్రయాణం ఫొటోలు ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్నాయి. విమానాశ్రయాల్లో తమను వీఐపీల్లాగా చూడాలని, ప్రత్యేక ధరతో టికెట్లు ఇవ్వాలని, వీఐపీ లాంజ్‌లోకి అనుమతించాలని, ఇంకా కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కొందరు ఎంపీలు డిమాండు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో మాజీ సీఎం జరిపిన ఈ సాధారణ ప్రయాణాన్ని నెటిజన్లు కీర్తిస్తున్నారు.

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments