Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి మోజులో ఇద్దరి పిల్లల తల్లి... అందుకే తిరుమల చిన్నారి కిడ్నాప్... ఇదీ స్టోరీ(వీడియో)

అక్రమ సంబంధం ఎంతటి పనినైనా చేయిస్తుంది. అది అందరికీ తెలిసిందే. వావివరసలు మరిచిపోయి కొంతమందైతే ఇళ్ళు వదిలి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. మరికొంతమందైతే పెళ్ళిళ్ళు చేసుకుని కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయిన వారు లేకపోలేదు. అలాంటి సంఘటనే తమిళనాడు రాష్ట్రం నామక్క

Webdunia
సోమవారం, 3 జులై 2017 (12:32 IST)
అక్రమ సంబంధం ఎంతటి పనినైనా చేయిస్తుంది. అది అందరికీ తెలిసిందే. వావివరసలు మరిచిపోయి కొంతమందైతే ఇళ్ళు వదిలి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. మరికొంతమందైతే పెళ్ళిళ్ళు చేసుకుని కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయిన వారు లేకపోలేదు. అలాంటి సంఘటనే తమిళనాడు రాష్ట్రం నామక్కల్‌లో జరిగింది. సంఘటన అక్కడ జరిగితే ఆ కథకు ముగింపు తిరుమల వేదికైంది. 
 
తమిళనాడు రాష్ట్రం నామక్కల్ సమీపంలోని రాశిపురం. కొండకు దగ్గరగా ఉన్న ప్రాంతం. అశోక్, తంగవై వీరు పక్కపక్క ఇంటివారు. అశోక్ ఈమధ్యనే చదువు పూర్తిచేసి స్థానికంగా పనిచేసుకుంటున్నాడు. తంగవైకు పెళ్ళయి ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు. పక్కపక్కనే ఇళ్ళు కావడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ తరువాత అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో తంగవై భర్త, కూతుళ్ళను వదిలిపెట్టి ప్రియుడితో కలిసి బయటకు వచ్చేసింది. ఇద్దరూ కలిసి ఒకటిన్నర సంవత్సరం పాటు బెంగళూరులోనే ఉన్నారు. నిన్నేమీ అనము ఇంటికి వచ్చెయ్.. అంటూ అశోక్ ఇంటిలో ఒత్తిడి ఎక్కువ కావడంతో తంగవైను తీసుకుని ఇంటికి వచ్చాడు.  
 
తల్లిదండ్రుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాడు. తామిద్దరం కలిసి ఉండటం వల్ల తమకు ఒక బాబు పుట్టాడని అశోక్ తన కుటుంబ సభ్యులను నమ్మబలికాడు. తంగవై కూడా అలాగే చెప్పేసింది. అయితే పిల్లాడిని తీసుకురమ్మని అశోక్ ఇంటిలో చెప్పడంతో ఇద్దరూ కలిసి ఆలోచించారు. పిల్లాడు ఎలాగైనా కావాలన్న ఉద్దేశంతో కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే తిరుమలను వేదికగా చేసుకున్నారు. ఇద్దరూ కలిసి తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చారు. దర్శనం చేసుకుని ఆ తరువాత గొల్లమండపం వద్ద సేదతీరారు. పిల్లలు ఎవరికి ఎంతమంది ఉన్నారో చూడటం ప్రారంభించారు. అప్పుడే అనంతపురం జిల్లాకు చెందిన వెంకటేష్‌ కుటుంబం నలుగురు పిల్లలతో గొల్లమండపం ముందే సేదతీరింది.
 
ఇక అశోక్‌, తంగవై ప్లాన్ చేశారు. నువ్వు ఆలయం వెనుక ఉండి నేను చిన్నారిని తీసుకొస్తానని చెప్పాడు. చెప్పినట్లుగానే వెంకటేష్‌ కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉంటే చిన్నారిని ఎత్తుకెళ్ళాడు. అనుకున్న విధంగా ఆలయం వెనుక వెళ్ళి తంగవైకి చిన్నారికి ఇచ్చాడు. బాబు ఎవరికీ కనిపించకుండా టవల్ కప్పి ఇక తీసుకెళ్ళిపోయారు.  నేరుగా స్వగ్రామానికి చేరుకుని చిన్నారి చెన్నకేశవులను అశోక్ తల్లిదండ్రులకు చూపించారు. అయితే అక్కడే ఒక ట్విస్ట్ చిన్నారి పాలు తాగలేదు. రెండు,మూడు రోజులుగా ఇదే తంతు. చిన్నారిని ఎంత బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. చిన్నారి ఏడుస్తూనే ఉన్నాడు.
 
అశోక్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చేసింది. దీంతో పాటు తిరుమలలో చిన్నారి తప్పిపోయాడని తమిళ టీవీ ఛానళ్ళు, పేపర్లలో ప్రకటనలు రావడం ప్రారంభమయ్యాయి.  తరువాత తమిళనాడు బస్సుల వెనుక చిన్నారి ఫోటోలు కూడా కనిపించాయి. కిడ్నాపర్ల ఫోటోలు వీరిద్దరివే. ఇక అశోక్ తల్లిదండ్రులు నిర్ణయానికి వచ్చేశారు. చిన్నారిని తీసుకెళ్ళి పోలీస్టేషనులో అప్పగించమని చెప్పారు. వారిద్దరూ ససేమిరా అనడంతో బలవంతంగా లాక్కెళ్ళి పోలీస్టేషన్‌లో అప్పగించారు. అలా తిరుమలలో కిడ్నాప్ అయిన చిన్నారి చెన్నకేశవుల కథ సుఖాంతమయితే అక్రమ సంబంధం పెట్టుకున్న అశోక్, తంగవైలు జైలులో ఊచలు లెక్కిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Kissik Song- ఏడు కోట్లు ఆదా చేసిన శ్రీలీల.. ఎలా?

బరువెక్కుతున్న కేతిక శర్మ హృదయ అందాలు.. కుర్రాళ్లు ఫిదా!

ఎర్రచీర దర్శకుడు సి.హెచ్.సుమన్ బాబు దర్శకత్వంలో సోషియో ఫాంటసీ

బాల్యం నుంచే దేశభక్తి ని అలవరుసుకునేలా అభినవ్ చిత్రం - భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్

అజిత్ తో మూవీ తర్వాతే కంగువ 2 చేస్తాం, దీపిక పడుకోన్ నాయిక కాదు : కేఈ జ్ఞానవేల్ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments