Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేకాఫ్ అయిన వెంటనే పనిచేయని ఏసీ వ్యవస్థ.. పేపర్లే విసనకర్రలు...

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విమానం ఒకటి ప్రయాణికులను తీవ్రఅవస్థలకు గురిచేసింది. ఈ విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాలకే ఏసీ పని చేయకపోయే సరికి ప్రయాణికులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వివర

Webdunia
సోమవారం, 3 జులై 2017 (11:33 IST)
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విమానం ఒకటి ప్రయాణికులను తీవ్రఅవస్థలకు గురిచేసింది. ఈ విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాలకే ఏసీ పని చేయకపోయే సరికి ప్రయాణికులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
వెస్ట్ బెంగాల్‌లోని బగ్‌డోరా నుంచి ఢిల్లీకి విమానం 168 మంది ప్రయాణికులతో ఆదివారం మధ్యాహ్నం 1.55 గంటలకు బయల్దేరింది. విమానం బయల్దేరిన 20 నిమిషాల తర్వాత ఏసీ పని చేయడం లేదని ఎయిరిండియా సిబ్బందికి ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. కాసేపట్లో ఏసీ పని చేస్తుందని సిబ్బంది చెప్పింది. కానీ, ఎంతకూ పని చేయలేదు. 
 
దీంతో తమ వద్ద ఉన్న న్యూస్ పేపర్లను విసనకర్రలుగా ఉపయోగించి.. ఉపశమనం పొందారు. కొద్ది మంది ప్రయాణికులు విమానంలో ఉన్న ఆక్సిజన్ మాస్క్‌లు ఉపయోగించినప్పటికీ.. అవి కూడా పని చేయలేదని వాపోయారు. ప్రయాణికులు కొందరు ట్విట్టర్ ద్వారా ఎయిరిండియా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన కూడా ఫలితం లేకపోయింది.

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments