సీఎం జగన్‌ మెడపై బీజేపీ కేసుల కత్తి?

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (11:55 IST)
నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడం, శాఖల వారీగా సమీక్షలు నిర్వహించడం మొదలుపెట్టారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఆయన ప్రభుత్వ పాలపై పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. అదేసమయంలో జగన్ వైఖరిని కమలనాథులు నిశితంగా గమనిస్తున్నారు. జగన్ ఏమాత్రం తోకజాడించినా ఆయన మెడపై కేసుల కత్తి పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 
 
నిజానికి జగన్‌పై 31 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో అవినీతి, ఆదాయానికి మించి ఆస్తుల సేకరణ, క్విడ్‌ప్రోకో, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఐటీ వంటి అనేక కేసులు ఉన్నాయి. దీంతో జగన్ కేంద్రంతో కయ్యానికిపోకుండా ప్రేక్షక పాత్ర పోషించాల్సిన పరిస్థితి రావచొచ్చు. ఇదే అదునుగా భావించిన బీజేపీ.. ఆయన్ను తమ చెప్పు చేతల్లో పెట్టుకునేందుకు ప్రయత్నించవచ్చు. 
 
ముఖ్యంగా, రాష్ట్రం 2.50 లక్షల కోట్ల రూపాయలన అప్పుల ఊబిలో ఉందని సీఎం జగన్ ఇటీవల స్వయంగా ప్రకటించారు. ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్ వద్ద ఒదిగి ఉండాల్సిన పరిస్థితి ఉంది. కేంద్రం ఇచ్ఛే నిధులపై ఆధారపడక తప్పదు మరి. 
 
ఒకవేళ తమ పార్టీలో విలీనం కావాలని బీజేపీ నాయకులు వైసీపీని కోరితే ఏం చేయాలో ఈ పార్టీ ఊహించలేకపోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ అండ్ కో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఫిర్యాదు అయినా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అందితే వైసీపీ ప్రభుత్వం రోజులు లెక్క పెట్టుకోవలసిందేనంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments