బండ్ల గణేష్ సంచలన నిర్ణయం.. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటో?

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (18:56 IST)
రాజకీయాలు... సినిమా రెండూ వేరు వేరు.. సినిమాలలో అత్యున్నత స్థాయిలకు వెళ్లిన వాళ్లు కూడా రాజకీయాలలో ఇమడలేక ఫ్లాప్ అయిపోతూంటారు.. ఇక చిరంజీవి లాంటి వారైతే రాజకీయాల్లో ఇమడలేక అస్త్రసన్యాసం చేసేసి రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు అలా ప్రచారానికి వచ్చి ఇలా భయపడి వెనక్కి వెళ్లిపోతున్నారు. 
 
సినిమాల్లో వెలుగు వెలిగి.. రాజకీయాల్లోనూ వెలగిపోదామని ముందుకొచ్చిన ఎందరో నిరాశతో వెనుదిరగడం చూస్తూనే ఉన్నాము... తాజాగా మరో సినీ ప్రముఖుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పేసాడు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్.. సీటు దక్కకపోవడంతో హతాశుడయ్యాడు. తరువాత కాంగ్రెస్ అధికార ప్రతినిధి హోదాలో... తెలంగాణ రాష్ట్రసమితి - కేసీఆర్ పాలనపై సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే గొంతు కోసుకుంటానన్న ఈయన డైలాగ్ అప్పట్లో వైరల్ గా మారింది. 
 
అయితే ఎవ్వరూ ఊహించని విధంగా... బండ్ల గణేష్ అందరికీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసేసుకున్నాడు. రాజకీయాల నుండి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఆయన... ‘నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాల  నుండి నిష్ర్కమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీకి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుండి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా విమర్శలు వ్యాఖ్యల పట్ల బాధపడ్డ వారందరినీ పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను’ అంటూ బాధతాప్త హృదయంతో ట్వీట్ చేయడం రాజకీయంగా సినిమాలోకంలో సంచలనంగా మారింది.
 
కాగా... బండ్ల గణేష్ రాజకీయాల నుంచి వైదొలగడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఆయన ట్వీట్‌కు కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రాజకీయ బురద నుండి బయటపడ్డావని కొందరంటూంటే.. రాజకీయం అనేది పచ్చబొట్టు లాంటిది.. అది నిన్ను వదలదు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి... ఆయన రాజకీయాలే వదిలేసారో లేక పార్టీని మాత్రమే వదిలారో వేచి చూడాల్సిందే... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు

యుఫోరియా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను : భూమిక

జియో స్టార్‌లో ప్ర‌భాస్ .. ది రాజా సాబ్ ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments