Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు పొంగిపోలేదు... నేడు కుంగిపోలేదు.. దటీజ్ మంత్రి నారాయణ

ఏపీ రాష్ట్ర పురపాలకశాఖామంత్రి పి.నారాయణ పుత్రశోకంతో తల్లడిల్లిపోతున్నారు. చేతికి అందివచ్చిన బిడ్డను కోల్పోయిన ఆయన.. లోపల పుట్టెడు దుఃఖం పెట్టుకుని కుమారుడి మృతదేహం వద్ద, అంత్యక్రియల సమయంలో ఎంతో నిబ్బర

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (12:09 IST)
ఏపీ రాష్ట్ర పురపాలకశాఖామంత్రి పి.నారాయణ పుత్రశోకంతో తల్లడిల్లిపోతున్నారు. చేతికి అందివచ్చిన బిడ్డను కోల్పోయిన ఆయన.. లోపల పుట్టెడు దుఃఖం పెట్టుకుని కుమారుడి మృతదేహం వద్ద, అంత్యక్రియల సమయంలో ఎంతో నిబ్బరంగా, మనోధైర్యంతో ఉన్నారు. నిజానికి చేతికందిన కొడుకును అకాల మృత్యువు కబళించడంతో నారాయణను ఎలా సముదాయించాలో అని ప్రతి ఒక్కరూ దిగులుపడ్డారు. అయితే, 23 గంటల ప్రయాణం అనంతరం కుమారుడి మృతదేహాన్ని చూసిన నారాయణ 20 నిమిషాల పాటు తనలోనే తాను రోదిస్తూ మౌనంగా నిలబడ్డారు. ఆ తర్వాత బాధనంతా దిగమింగుకుని ధైర్యంగా కనిపించారు. ఆయన్ను చూసిన ప్రతి ఒక్కరూ ఎంతటి మనోధైర్యం అంటూ మెచ్చుకున్నారు. 
 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట విదేశీ పర్యటనకు వెళ్లిన బృందంలో మంత్రి నారాయణ కూడా ఉన్నారు. తండ్రి లండన్‌కు బయలుదేరినపుడు నిషిత్ స్వయంగా నారాయణకు వీడ్కోలు పలికాడు. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నారాయణ తనయుడితో ఫోనలో మాట్లాడి "ఎక్కడున్నావ్‌.. నిషీ. జాగ్రత్తగా ఇంటికి వెళ్ల"మని చెప్పారు. ఇలా చెప్పిన 7 గంటలకే కొడుకు మరణ వార్తను నారాయణ విన్నారు. కొన్ని గంటల ముందు మాట్లాడిన కుమారుడు ఇక లేడన్న వార్తను విని నారాయణ తట్టుకోలేకపోయారు. 
 
గత బుధవారం హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిషిత్, అతని స్నేహితుడు రాజా రవివర్మలు దుర్మరణం పాలైన విషయం తెల్సిందే. ఆ సమయంలో లండన్ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణకు సమాచారం చేరవేసేందుకు అధికారులు పలు రకాలుగా మథనపడ్డారు. చివరకు టీవీలో ప్రసారమవుతున్న వార్తలు చూసి కుమారుడి మృతి వార్తను తెలుసుకున్న మంత్రి నారాయణ... కొద్దిసేపు కుప్పకూలిపోయారు. ఆ తర్వాత తేరుకుని స్వదేశానికి కదిలారు. 
 
లండన్ నుంచి చెన్నై వరకు సాగిన 23 గంటల విమాన ప్రయాణంలో కొడుకును తలుచుకుని ఎంతో మథనపడ్డారు. స్నేహితుడిలా వ్యవహరించే కొడుకు తనకు దూరమయ్యాడని, ఒంటరి ప్రయాణంలో వెక్కివెక్కి ఏడ్చారు. గురువారం రాత్రి 12 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న నారాయణ అక్కడి నుంచి గురువారం వేకువజాము 3.30 గంటల ప్రాంతంలో నెల్లూరుకు చేరుకుని నిషిత్ పార్థివదేహాన్ని ఆపాదమస్తకం ఆవేదనగా తేరిపారచూశారు. 
 
మృతదేహం వద్దే 20 నిమిషాల పాటు మౌనంగా రోధిస్తూ నిలబడిపోయారు. అంతలోనే తేరుకుని తాను అధైర్య పడితే కుటుంబం, విద్యా సంస్థల పరిస్థితి ఏమిటన్న ఆలోచనతో మంత్రి నారాయణ నిబ్బరంగా వ్యవహరించారు. ప్రముఖులు పరామర్శించి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు కూడా నారాయణ గంభీరంగా ఉంటూ "మన చేతిలో ఏమీ లేదు... మనం చేయగలింది అంతకంటే ఏమీ లేదు.. జరిగింది ఏదో జరిగింది".. అంటూ వారినే ఓదారుస్తూ కనిపించారు. 
 
కుటుంబ సభ్యులు ఏడుస్తున్నా వారినీ ఓదార్చారు. ఇప్పుడు తాను ఏడవడం వల్ల ఏమి ప్రయోజనమనే వైరాగ్యం ఆయనలో కనిపించింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు పొంగి పోలేదు.. అలాగే కొడుకు ఇక లేడని తలుచుకుని కుంగిపోకుండా గుండె ధైర్యంతో వ్యవహరించడం ఆయనకే చెల్లింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments