Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా.. రోజా.. ఏ స్థాయికి ఎదిగావమ్మా.. ముక్కుపై వేలేసిన చంద్రబాబు..?

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (14:08 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి గెలుపుకు సినీ నటి రోజా కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎలాగంటే? జగన్‌ను సోదరుడిగా భావించే రోజా.. ఆయన గెలుపు కోసం.. భారీగా ప్రచారంలో పాల్గొన్నారని వైకాపా శ్రేణులు ప్రశంసిస్తున్నాయి. 
 
ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను చేపట్టిన సందర్భంగా వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా కూడా పాదయాత్ర చేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సర్కారుపై విమర్శలు గుప్పించడంలో దిట్ట అయిన రోజా.. జగన్‌ను గెలిపించేందుకు పాదయాత్ర చేశారు
 
ఇందుకు గాను గాలేరు-నగరి ప్రాజెక్టును వేదికగా చేసుకున్నారు. తిరుమలకు పాదయాత్ర చేశారు. గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రోజా ఈ పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా నగరి నుంచి తిరుమల కొండ వరకు 88 కిలోమీటర్లు రోజా పాదయాత్ర చేశారు. ఆపై శ్రీవారిని దర్శించుకుని పాదయాత్రను ముగించారు. ఇలా జగన్ విజయం కోసం శ్రీవారికి మొక్కుకున్నారు. 
 
ఆపై ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. నగరి ప్రజల కోసం సంక్షేమ పథకాలు చేపడుతూ ముందుకు దూసుకుపోయారు. త్వరలో సినీ నటి రోజా పూర్తి స్థాయిలో జగన్ కోసం పనిచేయాలనుకుంటున్నారు. సినిమాలకు, షోలకు స్వస్తి చెప్పేయాలని భావిస్తున్న రోజా.. నవ్యాంధ్ర రెండో సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్‌కు సలహాదారుగా, ప్రాజెక్ట్ ప్రొగ్రెసర్‌గా వ్యవహరిస్తున్నారట. 
 
ఇలా పదేళ్ల పాటు జగన్‌తో పాటు కష్టపడిన రోజా.. రాజకీయ నేతగా మంచి మార్కులేసుకున్నారు. పదేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చి.. వైకాపా అగ్రనేతగా ఎదిగిన రోజాను చూసి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ముక్కుపై వేలేశారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments