Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022 పవన్ కు కలిసొచ్చిందా.. ఏంటి సంగతి?

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (16:18 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు 2022 కలిసొచ్చిందా అనేది తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీని కాస్త చదవాల్సిందే. పవన్ ఓ వైపు సినిమాలతో మరోవైపు జనసేన పార్టీ బాధ్యతలను తలపై వేసుకుని రెండు పడవల ప్రయాణాన్ని ఏకకాలంలో చేస్తుండటంతో కొంత అయోమయ స్థితిలో వున్నారు ఫ్యాన్స్. కానీ గతంలో పోలిస్తే.. జనసేన స్పీడు 2022లో పెరిగింజదనే చెప్పాలి. 
 
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనుందనే క్లారిటీ ఇచ్చేసారు జనసేనాని. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆమోదిస్తున్నారు. 2022 పవన్ కు కాస్త కలిసొచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. రాజకీయాల పరంగా, సినిమాల పరంగా పర్లేదని చెప్తున్నారు నిపుణులు. 
 
సినిమాల విషయానికి వస్తే.. భీమ్లా నాయక్, అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమేక్ గా తెలుగులోకి విడుదలైంది. ఇందులో పవన్-రానా కలిసి నటించారు. ఈ  చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం మూడు సినిమాలు పవన్ చేతిలో వున్నాయి. ఈ సినిమాల షూటింగ్ లతో పాటు రాజకీయాల్లోనూ జనసేనాని చురుగ్గా వున్నారనే చెప్పాలి. 
 
రాజకీయ పార్టీలకు ధీటుగా సై అంటున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేయడంలో పవన్ కూడా దిట్టే అనేందుకు పలు కామెంట్లు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదే జోరును పవన్ కొనసాగిస్తే.. తదుపరి ఎన్నికల్లో జనసేన పార్టీ బొమ్మ పడటం ఖాయమని రాజకీయ పండితులు జ్యోతిష్యం చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

Vijay: రష్మిక మందన్న బర్త్ డే వేడుకను ఓమన్ లో జరిపిన విజయ్ దేవరకొండ !

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments