నటీనటులు: విశాల్, సునైనా, ప్రభు, మునిష్కాంత్, తలైవాసల్ విజయ్, మిషా గోషల్ తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: బాలసుబ్రమణ్యం & బాలకృష్ణ తోట, సంగీత దర్శకులు: యువన్ శంకర్ రాజా, నిర్మాతలు: రమణ & నందా, దర్శకుడు : ఎ వినోద్ కుమార్
హీరో విశాల్ తాజా చిత్రం లాఠీ. ఎప్పటినుంచో తెస్తున్న ఈ సినిమా యాక్షన్ చిత్రంగా టీజర్, ట్రైలర్ చెప్తున్నది. కానిస్టేబుల్ లైఫ్ గా ఈ సినిమా ట్రైలర్ చెప్పేసింది. రౌడీలకు, పోలీస్ కానిస్టేబుల్ మధ్య వార్ అని అర్థం అయింది. ఎ వినోద్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గురువారమే విడుదల అయింది. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ :
మురళీ కృష్ణ (విశాల్) నిక్కచ్చి పోలీస్ కానిస్టేబుల్. తన పై అధికారి ఆర్డర్ వేయడంతో ఓ నేరస్తుడికి కోర్టుకు అప్పగిస్తాడు. ఆ తర్వాత అతను చనిపోవడంతో మురళీ కృష్ణ ఏడాది పాటు సస్పెండ్ అవుతాడు. మురళీ కృష్ణ భార్య కవిత (సునైనా) నర్స్. వారికి చిన్న పిల్లవాడు. వాడికి శ్వాస సమస్య. ఏడాది లోపు మురళీ కృష్ణ విధుల్లోకి వస్తాడు. మురళీ కృష్ణ డ్యూటీకి వచ్చాక ఆ ఊరి రౌడీ కొడుకు నేరస్థుడు అయిన వీరను డి.ఎస్.పి. ఆర్డర్ వేయడంతో లాఠీ తో చితక బాదుతాడు. ఆ తర్వాత ఊరికి దూరంగా వీరాను పడేస్తాడు. ఇది తెలిసిన వీర తండ్రి మురళీ కృష్ణను టార్గెట్ చేశాడు ? వీర తానూ వాడికి నరకం చూపించాలని రగిలిపోతుంటాడు. వీరకు రేపు పెళ్లి అనగా మురళీ కృష్ణ ఒంటరిగా కనిపిస్తాడు. అప్పడు వీర తన గ్యాంగ్ తో ఏమి చేసాడు? అన్నది మిగిలిన సినిమా.
విశ్లేషణ:
ప్రజలకు సమస్య వస్తే.. పోలీసులు వెళ్తారు, రాజకీయ నాయకులకు సమస్య వస్తే పోలీస్ డిపార్ట్మెంటే వెళ్తుంది. మరీ ఒక పోలీస్ కానిస్టేబుల్ కి సమస్య వస్తే ఎవడు వెళతారు? ఇదే లాఠీ సినిమా కథ. ఇందులో పోలీస్ కానిస్టేబుల్ ను హీరోగా చూపించారు. మరో వైపు రౌడీలకు, రాజకీయ నాయకులకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా మడుగులు వత్తుతుంది అని కూడా చక్కగా చూపాడు. సామాజిక అంశాన్ని కూడా టచ్ చేసాడు. అమాయకు రాలైన ఓ అమ్మాయిని అతి దారుణంగా వీర చంపడం కథకు మలుపు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? అనే కోణంలో సాగిన ఈ లాఠీ సినిమా కొన్ని సీన్స్ లో ఆకట్టుకుంది. తన నటనతో విశాల్ ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.
కానీ కేవలం పోలీస్ కు రౌడీకి మధ్య జరిగే వార్ ఈ సినిమా. ఇందులో డిపార్ట్మెంట్ ఏ విధంగా పోలీసుకు సాయపడింది అనేది చెప్పే ప్రయత్నం చేసాడు. సీరియస్ కథ కాబట్టి పాటలకు అవకాశం లేదు. ఫామిలీ సెంటిమెంట్ ఉంది. మొదటి భాగం సామాజిక సమస్యను హైలెట్ చేస్తే, సెకండ్ ఆఫ్ మాత్రం కేవలం విలన్, పోలీస్ మధ్య సాగే పోరే ఉండటం, హింస ఎక్కువగా ఉండటం తో ఆడియన్ కు విసుగు పుట్టిస్తుంది. హై యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా సాగే ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఎ వినోద్ కుమార్ దర్శకత్వ పనితనం బాగున్నా.. తీసుకున్న స్క్రిప్ట్ లో విషయం లేకపోవడం సినిమా ఫలితం దెబ్బతింది. ఒకరకంగా చెప్పాలంటే ట్రైలర్లో చూపిన బిల్డింగ్ లోని ఫైట్ సెకండ్ ఆఫ్ మొత్తం ఉంటుంది.
యాక్షన్ సినిమా కాబట్టి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాతలు రమణ & నందా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి.
లాఠీ అంటూ వచ్చిన ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో డోస్ ఎక్కువయి లాఠీతో కొట్టినట్లుంది. అందుకే ఈ సినిమా ఆసక్తికరంగా సాగలేదు. కథాకథనాలు సీరియస్ గా ఉండటంతో వినోదంపై ఆస్కారం లేదు. వీర పాత్ర చేసిన ఆర్టిస్ట్ విశాల్ కు చిన్ననాటి స్నేహితుడు. ఇది కూడా సినిమాకు మైనెస్.