అస్సాం సింగర్ మృతి కేసులో మేనేజర్ అరెస్టు

ఠాగూర్
బుధవారం, 1 అక్టోబరు 2025 (10:57 IST)
అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్‌ గార్గ్‌ (52) మృతి కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల సింగపూర్‌ పర్యటనలో గార్గ్ ఉండగా ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పూర్తి స్థాయి దర్యాప్తునకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 
 
నార్త్‌ఈస్ట్‌ ఇండియా ఫెస్టివల్‌ చీఫ్ ఆర్గనైజర్‌ శ్యామ్‌కాను మహంత, జుబీన్‌గార్గ్‌ మేనేజర్‌ సిద్ధార్థశర్మలను అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మహంతను అరెస్టు చేయగా గురుగ్రామ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో శర్మను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరినీ గువాహటికి తరలించినట్లు తెలిపారు.
 
జుబీన్‌ మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్ ఇళ్లలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే సౌండ్‌ రికార్డిస్ట్ నివాసంలోనూ తనిఖీలు జరిగాయి. ఇక ఇప్పటికే ఈ కేసు విషయంలో మ్యుజీషియన్ శేఖర్ జ్యోతి గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. జుబీన్ మరణానికి ముందు ప్రయాణించిన నౌకలో ఉన్న బృందంలో గోస్వామి కూడా ఉన్నారని అందుకే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments