బీజేపీ ఎమ్మెల్యే నివాసంలో యువకుడు ఆత్మహత్య.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (11:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే నివాసంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ప్రియురాలితో గొడవపడి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటన ఆ రాష్ట్ర రాజధాని లక్నోలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భాజపా ఎమ్మెల్యే యోగేశ్ శుక్లా మీడియా సెల్లో శ్రేష్ఠ తివారీ అనే 24 ఏళ్ల యువకుడు విధులు నిర్వర్తిస్తున్నాడు. తివారీ నాలుగేళ్లుగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో వారిద్దరూ ఏదో విషయంలో గొడవ పడ్డారు. 
 
విధుల్లో భాగంగా ఎమ్మెల్యే అధికార నివాసంలో ఉన్నప్పుడు తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఆమెతో మాట్లాడుతూనే ఉరేసుకున్నాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించి ఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.. యువకుడు విగత జీవిగా పడి ఉన్నాడు. ప్రియురాలి ఫోనును పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments