Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమ్మకంగా పనిచేస్తున్నాడని ఇంట్లో పెట్టుకుంటే యజమాని కుమార్తెను లొంగదీసుకుని...

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (19:45 IST)
బిస్కెట్ వ్యాపారి దగ్గర పనికి చేరాడు. ఎంతో నమ్మకంగా ఉండటంతో ఇంటికి కూడా పిలిపించుకుని పనులు చెప్పేవాడు యజమాని. అదే అతను చేసిన తప్పని ఆ తరువాత అర్థం చేసుకున్నాడు. పదవ తరగతి చదువుతున్న యజమాని కూతురిని లైన్లో పెట్టి ఆ తరువాత ఆమెను అన్ని విధాలుగా వాడేసుకున్నాడు. డబ్బుల కోసం ఆ యువతిని హింసిస్తూ ఉండటంతో అసలు విషయం బయటపడింది.

 
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి చెందిన 23 యేళ్ళ ప్రవీణ్ కుమార్ బిస్కెట్ వ్యాపారి అశోక్ దగ్గర పనికి చేరాడు. సంవత్సరంగా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. చెప్పిన పని చెప్పినట్లు టకటకా చేసేవాడు. దీంతో ప్రవీణ్ పైన అశోక్‌కు నమ్మకం ఏర్పడింది.

 
ఆ తరువాత ఇంటికి పిలిపించుకుని ఇంట్లో కూడా పనులు చేయించుకునేవాడు. ఇంటి పని చేస్తున్న ప్రవీణ్‌కు అశోక్ కూతురు కనిపించింది. ఆమెకు దగ్గరయ్యాడు. కొన్నిరోజులకే ఆమె మొబైల్ నెంబర్ తీసుకుని ఫోన్లు చేయడం ప్రారంభించాడు.

 
చాలా అందంగా వున్నావంటూ పొగడ్తలతో ముంచెత్తుతూ ఆమెను మాయమాటలతో దగ్గర చేర్చుకున్నాడు. శారీరకంగా కలిశాడు. అయితే ఆమె నుంచి డబ్బులు కూడా తీసుకునేవాడు. ఇంట్లో పెట్టిన డబ్బులు కనిపించకుండా పోతుండటంతో అశోక్‌కు అనుమానం వచ్చింది.

 
భార్యను ప్రశ్నించాడు. తనకు తెలియదని చెప్పడంతో కుమార్తెపై అనుమానం వచ్చింది. గట్టిగా నిలదీయడంతో ఆమె అసలు విషయాన్ని చెప్పేసింది. ప్రవీణ్ డబ్బులు అడుగుతూ ఉండటంతో తానే దొంగిలించి ఇస్తున్నానని చెప్పింది. దీంతో అశోక్ ప్రవీణ్ పైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నమ్మినందుకు ప్రవీణ్ చేసిన మోసంపై అశోక్ ఆగ్రహంతో ఊగిపోతున్నాడట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments