Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై సామూహిక అత్యాచారం చేయించిన మహిళ.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 29 మే 2022 (17:41 IST)
ఆమె కూడా తనలాంటి ఆడదే అనే విషయాన్ని మరిచిపోయిన ఓ మహిళ.. ఓ యువతిపై అత్యాచారం చేయించింది. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని కొండాపూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కొండాపూర్ శ్రీరాంనగర్‌లో భర్తతో కలిసి ఓ మహిళ నివాసం ఉంటోంది. అదే కాలనీలో ఉండే యువతితో మహిళ భర్తకు పరిచయం ఏర్పడడంతో ఇద్దరూ అప్పుడప్పుడు మాట్లాడుకుంటుండే వారు. ఇది చూసిన ఆ మహిళ ఇద్దరిపై అనుమానం పెంచుకొని.. పైశాచిక కుట్రకు పథకం వేసింది. 
 
ఈ నెల 26న మాట్లాడాలి రమ్మంటూ యువతిని శ్రీరాంనగర్‌లోని తన ఇంటికి పిలిచి.. ఇంట్లోని బాత్‌రూంలో బంధించింది. ఆ తర్వాత యువతి నోట్లో గుడ్డలు కుక్కి.. నలుగురు యువకులను పిలిపించి వారితో యువతిపై దాడి చేయించింది.
 
ఆ నలుగురు యువతిపై అత్యాచారయత్నం చేయడంతో పాటు పైశాచికంగా హింసించారు. యువతి ప్రైవేట్ భాగాలపై దాడి చేశారు. ఈ మొత్తాన్ని సదరు మహిళ ఫోన్‌లో చిత్రీకరించింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించింది.
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మహిళతో పాటు నలుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం