Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అద్దె ఇల్లు చూపిస్తానని లోపలికి తీసుకెళ్లి తలుపు గడియపెట్టి అత్యాచారయత్నం...

Advertiesment
అద్దె ఇల్లు చూపిస్తానని లోపలికి తీసుకెళ్లి తలుపు గడియపెట్టి అత్యాచారయత్నం...
, శనివారం, 28 మే 2022 (13:01 IST)
హైదరాబాద్ లోని చాదర్‌ఘాట్‌లో అద్దె ఇంటిని చూపుతాననే నెపంతో మహిళను ఇంటి లోపలికి తీసుకెళ్లిన ఓ వ్యక్తి ఆమెపై అత్యాచార యత్నం చేసాడు. నగర శివార్లలో తల్లిదండ్రులతో ఉంటున్న బాధితురాలు సిటీకి వెళ్లాలనే ఆలోచనలో భాగంగా ఆన్‌లైన్‌లో అద్దె ఇళ్ల కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో ఆమెకి అద్దె ఇళ్లను చూసిపెట్టే ఓ ఆన్‌లైన్ గ్రూప్‌ కనబడటంతో అందులో చేరింది.

 
తక్షణమే, ఆమెకు అనుమానితుడు కింగ్ ఖాన్ అలియాస్ హమీద్ నుండి అద్దె వసతి లభ్యత గురించి మెసేజ్ వచ్చింది. ఆమె దానికి స్పందించింది. ఆ తర్వాత మొబైల్ ఫోన్ నెంబరు ఇవ్వమని అడగటంతో ఆమె ఇచ్చింది. ఆ తర్వాత కొన్నిరోజులు సరైన ఇంటి గురించి వాట్సాప్‌లో చాటింగ్ కొనసాగించారని చాదర్‌ఘాట్ పోలీసులు తెలిపారు.

 
మే 19న ఓ ఇంటిని చూసి వద్దామనే నెపంతో ఆమెకు ఫోన్ చేసి కర్మన్‌ఘాట్ నుంచి బైక్‌పై ఎక్కించుకుని ఆనంద్ నగర్‌లోని అక్బర్‌బాగ్‌లోని ఓ ఇంటికి తీసుకెళ్లాడు. “ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత, అతను లోపలి నుండి తలుపుకి గడియపెట్టేసాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడి చేయడం ప్రారంభించాడు. ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని, ఆమెను నిర్బంధించి దుర్భాషలాడాడు. ఆమెను బట్టలు విప్పమని బెదిరించాడు, వేధించాడు” అని ఒక అధికారి తెలిపారు.

 
దాంతో బాధితురాలు పెద్దగా కేకలు పెట్టడం ప్రారంభించి అతనిని ప్రతిఘటించడంతో అతడు వెనకడుగు వేసాడు. వెంటనే ఆమెను తన బైక్‌పైన ఎక్కించుకుని నల్గొండ క్రాస్ రోడ్స్ సమీపంలోని బస్టాండ్‌లో పడవేసి అక్కడి నుండి పారిపోయాడు. 

 
“భయపడ్డ బాధితురాలు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. తన బంధువులతో తన కష్టాలను పంచుకోవడానికి ధైర్యం చేయలేక తనలో తానే కుమిలిపోయింది. ఆమె ప్రవర్తనలో మార్పును గమనించిన ఆమె సన్నిహితురాలు ఆమెను ప్రశ్నించగా, ఆమె తనపై జరిగిన దాడిని వివరించింది” అని అధికారి తెలిపారు. బాధితురాలు తన స్నేహితురాలి సహాయంతో చాదర్‌ఘాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17మంది మహిళల హత్య.. తెలంగాణ సీరియల్ కిల్లర్‌కు జీవిత ఖైదు