అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనీ భర్తను హత్య చేయించిన భార్య

ఠాగూర్
గురువారం, 16 అక్టోబరు 2025 (10:20 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలులో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కట్టుకున్న భర్తను ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి హత్య చేయించింది. ఈ దారుణ ఘటన తాజాగ వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
శ్రీపురం గ్రామానికి చెందిన 35 ఏళ్ల రాములు ప్లంబర్‌గా పనిచేస్తూ భార్య మానస, ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. ఆరు నెలల క్రితం వీరి ఇంట్లో బంగారం చోరీకి గురికావడంతో, పెద్ద ముద్దునూరు గ్రామానికి చెందిన మంత్రగాడు సురేశ్ గౌడ్ వద్దకు వెళ్లారు.
 
ఆ సమయంలో సురేశ్‌ గౌడ్‌తో మానసకు పరిచయం ఏర్పడి, కాలక్రమంలో అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. సురేశ్ తన సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన మానస, భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈ నెల 8న బంధువుల పెళ్లి ఉందని చెప్పి వెళ్ళింది. ఆ సమయంలోనే భర్తను హత్య చేయాలని పథకం వేసింది.
 
పైగా, డెయిరీ ఫామ్ నిర్వహిస్తున్న సురేశ్.. తన వద్ద పని చేసే ఇద్దరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముగ్గురు కలిసి రాములును పెద్ద ముద్దునూరుకు రప్పించారు. పథకం ప్రకారం అతనికి ఎక్కువ మద్యం తాగించి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం నోరు, ముక్కుకి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. రాములు ఒంటిపై గాయాలు చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయత్నించారు.
 
అనంతరం మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్ళారు. మృతదేహాన్ని చూసిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తన కొడుకు మృతిపై అనుమానం వచ్చిన రాములు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోడలు వివాహేతర సంబంధం, ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు సురేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments