Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి మోజులో భర్త హత్య.. శవాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేసి ప్లాస్టరింగ్..

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (08:41 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద షహర్‌లో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడిన భార్య.. కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత భర్త శవాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేసి ప్లాస్టరింగ్ చేసింది. చివరకు పోలీసుల చేతికి చిక్కి ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద షహర్‌కు చెందిన సతీశ్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం నీతు, ఐదేళ్ల కుమారుడితో కలిసి పొట్టకూటి కోసం నోయిడాకు వచ్చాడు. తాజాగా స్థానిక సరస్వతి కుంజ్‌లో సొంత ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఇంటి నిర్మాణం కోసం కుదుర్చుకున్న తాపీ మేస్త్రీ హర్పాల్‌తో నీతుకు పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త ఉంటే తమ ఆటలు సాగవని భావించిన నీతు.. ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ వేసింది. 
 
తమ పథకంలో భాగంగా, ఈ నెల 2వ తేదీన మద్యం మత్తులో ఉన్న భర్తను ప్రియుడి సాయంతో గొంతు నులిమి హత్య చేసింది. ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్లి పక్కనే నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడేసి పూడ్చేసి ప్లాస్టరింగ్ చేశారు. తన సోదరుడు కనిపించడం లేదని అతని సోదరుడు ఈ నెల 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోద చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా, నీతును అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయాన్ని వెల్లడించింది. దీంతో నిందితులిద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments