అప్పుల బాధ భరించలేక భర్తను చంపి భార్య ఆత్మహత్యాయత్నం

సెల్వి
శనివారం, 30 ఆగస్టు 2025 (14:25 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ జంట అప్పుల బాధ భరించలేక దారుణం నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ కలిసి చనిపోవాలని నిశ్చయించుకున్నారు. ఇంట్లో కూరగాయలు తరిగే కత్తితో భర్త గొంతు కోసి చంపేసిన భార్య.. ఆ తర్వాత అదే కత్తితో తన కూడా గొంతుకోసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీలో చోటుచేసుకుంది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... కేపీహెచ్‌బీలో నివాసం ఉంటున్న భార్యాభర్తలు రామకృష్ణ, రమ్యకృష్ణలు అప్పుల పాలయ్యారు. ఇటీవల అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి తీవ్రమైంది. పైగా, అప్పు తిరిగి చెల్లించే మార్గం లేకపోవడంతో భార్యాభార్తలు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. 
 
దీంతో తమ ఇంట్లోనే వారు ఆత్మహత్య ప్రయత్నించారు. తొలుత భర్త కొంతు కోసి చంపిన రమ్యకృష్ణ.. ఆ తర్వాత అదే కత్తితో తన గొంతుకోసుకుంది. చుట్టుపక్కుల వారు దీన్ని గమనించి ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే రామకృష్ణ చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
రమ్యకృష్ణను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం అధికంగా రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments