Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కానింగ్‌కు వెళ్లిన యువతి పట్ల అసభ్యప్రవర్తన!

ఠాగూర్
బుధవారం, 11 డిశెంబరు 2024 (14:44 IST)
విశాఖపట్టణం రాంనగర్‌లోని కేర్ ఆస్పత్రిలో స్కానింగ్‌కు వెళ్లిన ఓ యువతి పట్ల ల్యాబ్ అసిస్టెంట్ అసభ్యంగా ప్రవర్తించాడు. స్కానింగ్ పేరుతో మరోలా నడుచుకున్నాడు. దీంతో ఆ యువతి ఆందోళనకుగురై బిగ్గరగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత యువతి ఫిర్యాదు మేరకు నిందితుడిని మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్టు చేశారు. 
 
కైలాసపురం ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడింది. కుటుంబ సభ్యు లను తీసుకుని కేర్ ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు పరిశీలించి యాంకిల్, పొట్ట స్కానింగ్ చేయించుకుని, రిపోర్టు తేవాలని సూచించారు. ఆమె ఆదే ఆస్పత్రిలోని ల్యాబ్‌‍కు వెళ్లగా స్కానింగ్ ఇన్చార్జి కె.ప్రకాష్ సూచన మేరకుపై దుస్తులు తొలగించింది. స్కానింగులో పొట్టభాగం స్పష్టంగా రావాలంటే దుస్తులన్నీ తొలగించాలని చెప్పాడు. 
 
ఆ తర్వాత స్కానింగ్ నెపంతో ప్రైవేటు భాగాలు తాకడంతో యువతి కేకలు వేస్తూ బయటకు వచ్చింది. అక్కడే ఉన్న ఆమె బంధువులు విషయం తెలుసుకుని ప్రకాష్‌కు దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు. రిమాండ్ విధించింది. 
 
కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిల్లో ఇలాంటి ఘటనలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోహన్ బాబు కుటుంబానికి ఏదో నరఘోర తలిగిలింది : నట్టి కుమార్ (Video)

Allu Arjun latest update: పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటించే చిత్రం తాజా అప్ డేట్

బాహుబలి 2ని పడేసిన పుష్ప 2, ఎన్ని రోజుల్లోనో తెలుసా?

PUSHPA 2 Hits Fastest 1000 Cr: రూ.1000 కోట్ల క్లబ్ దిశగా పుష్పరాజ్

Manchu Manoj gets Emotional మా నాన్న దేవుడు : మీడియాకు తండ్రి తరపున మంచు మనోజ్ క్షమాపణలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట తాగకల 5 పానీయాలు

Vitamin C Benefits: విటమిన్ సి వల్ల శరీరానికి 7 ఉపయోగాలు

పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే?

winter health కండరాలు నొప్పులు, పట్టేయడం ఎందుకు?

తరచూ జలుబు చేయడం వెనుక 7 కారణాలు

తర్వాతి కథనం
Show comments