Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన ... రుద్రాపూర్‌లో నర్సుపై హత్యాచారం

ఠాగూర్
శుక్రవారం, 16 ఆగస్టు 2024 (12:42 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని రుద్రాపూర్‌ ఒక నర్సు హత్యాచారానికి గురైంది. ఈ నెల 30వ తేదీన పని చేస్తున్న ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన ఆమె అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగు చేసింది.
 
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఇటీవల ట్రైనీ డాక్టర్ (జూనియర్ వైద్యురాలు) సామూహిక హత్యాచారానికి గురైన ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమైన వేళ.. ఉత్తరాఖండ్ రాష్ట్రలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
 
ఉత్తరాఖండ్ సరిహద్దు ఉత్తరప్రదేశ్‌‍లోని బిలాస్‌పూర్ పట్టణంలో 33 ఏళ్లున్న వయసున్న ఓ మహిళ తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి అద్దె గదిలో ఉంటోంది. ఈ క్రమంలో జులై 30న తాను పనిచేస్తున్న రుద్రాపుర్‌లోని ఆసుపత్రి నుంచి తన విధులు నిర్వహించుకొని రాత్రిపూట ఇంటికి బయలుదేరింది. అయితే ఆమె ఇంటికి రాకపోవడంతో ఆమె సోదరి రుద్రాపుర్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఎనిమిది రోజుల తర్వాత ఆగస్టు 8న తన అపార్టుమెంట్ సమీపంలోని పొదల్లో మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్షకు పంపించగా ఆమెపై అత్యాచారం జరిగినట్లు వెల్లడైంది. 
 
ఈ ఘటనకు సంబంధించి రుద్రాపుర్ పోలీసులు నిందితుడు ధర్మేంద్రను అరెస్టు చేశారు. అతడిని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. బాధితురాలిని అనుసరించిన నిందితుడు.. ఆమె అపార్టుమెంట్‌కు సమీపంలోని ఏకాంత ప్రదేశంలో దాడి చేశాడు. మెడకు చున్నీ బిగించి, రాళ్లతో ఆమె ముఖంపై తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అత్యాచారం చేసి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లాడు. అనంతరం బాధితురాలి మొబైల్ ఫోన్, నగలు, డబ్బుతో పారిపోయాడు. ఆమె ఫోన్‌ను ట్రేస్ చేసిన పోలీసులు.. నిందితుడు రాజస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. ే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్‌ చేస్తా : రామ్‌గోపాల్‌వర్మ

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments