Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూవింగ్ ట్రైను ఏసీ బోగీలో మహిళపై టీటీఈ అత్యాచారం...

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (08:23 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. వేగంగా వెళుతున్న రైలు ఏసీ బోగీలో ట్రావెలింగ్ టిక్కెట్ కలెక్టర్ (టీటీఈ) మరో వ్యక్తితో కలిసి ఓ మహిళా ప్రయాణికురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నమెంట్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి టీటీఈని గుర్తించి అరెస్టు చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్ జిల్లాలో జరిగింది. 
 
చందౌసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేబీ సింగ్ వెల్లడించిన వివరాల మేరకు.. సుబేదార్ గంజ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు కోసం వేచిచూస్తున్న ఓ మహిళ (33)ను చూసిన టీటీఈ ఏసీ బోగీలోని తన సీటులో కూర్చోవాల్సిందిగా కోరాడు. దీంతో ఆ మహిళ ఆ బోగీలో ఎక్కి కూర్చొంది. కొంతసమయం తర్వాత మరో వ్యక్తితో కలిసి అక్కడకు వచ్చిన టీటీఈ.. తన స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ ఘటనపై శనివారం బాధితురాలు శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు... టీటీఈని రాజు సింగ్‌గా గుర్తించి అరెస్టు చేసినట్టు కేబీసింగ్ వెల్లడించారు. అతనితో కలిసి అత్యాచారానికి పాల్పడిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. నిందితుడిపై ఐపీసీ 376డి సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, బాధితురాలు నిందితుడు టీటీఈ రాజు సింగ్‌కు తెలిసిన మహిళ కావడం గమనార్హం. ఈ దారుణం ఈ నెల 16వ తేదీన రాత్రి పది గంటల సమయంలో చందౌనసి అలీఘర్ స్టేషన్ల మధ్య జరిగింది. బాధితురాలు చందౌసి నుంచి ప్రయాగ్ రాజ్ సుబేదార్‌గంజ్‌కు వెళుతుండగా అత్యాచారానికి గురయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments