Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

ఠాగూర్
ఆదివారం, 25 మే 2025 (14:38 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. కట్టుకున్న భార్యను భర్తతో పాటు మామ, ఆడపడుచులు వేధించారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే.. నువ్వు చచ్చిపోవచ్చు కదా అంటూ నిత్యం చీటిపోటి మాటలతో వేధించాడు. ఇది ఆ వివాహిత మనసు తీవ్రంగా నొచ్చుకుంది. అంతే బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని మురాదాబాద్‌కు చెందిన అమ్రీన్ జహాన్ నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. భర్త కుటుంబంతో పాటు మురాదాబాద్‌లో నివసిస్తోంది. అమ్రీన్ భర్త బెంగుళూరులో వెల్డర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల అమ్రీన్‌కు గర్భస్రావం జరగడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న తర్వాత మళ్లీ వేధింపులు మొదలయ్యాయి. 
 
కొన్నిసార్లు నా తిండి గురించి అంటారు. కొన్నిసార్లు నా గదికి కరెంట్ తీసేస్తారు. నా భర్తకు లేనిపోనివి చెబుతారు. నా ఆడపడుచు ఖతీజా, మామ షాహిద్ నా చావుకు కారణం. నువ్వు ఎపుడు చనిపోతానని అడుగుతాడు. నా అడపడుచు, మామ కూడా అదే మాట అంటాడు. నేనిక భరించలేను" అని ఆవేదన చేసింది. 
 
అనారోగ్యంతో ఉన్నపుడు చికిత్సకు అయిన ఖర్చు విషయంలో కూడా వేధించారని, ఆ డబ్బు తిరిగి ఇచ్చేయమని అడిగారని వాపోయింది. నా భర్త దగ్గర అంత డబ్బు ఉంటే మిమ్మల్ని అప్పు అడుగుతాడా? అంటూ కెమెరా ముందే ప్రాణాలు తీసుకుంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments