Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం తర్వాత నగ్నంగా నడుచుకుంటూ ఇంటికెళ్లిన బాలిక?

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (11:31 IST)
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ బాలికపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాత ఆ బాలిగ దుస్తులు లేకుండా నగ్నంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళింది. దీనికి సంబంధించిన వీడియో పెను దుమారం రేపింది. ఈ దారుణం ఈ నెల ఒకటో తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేశారు. ఈ దారుణం మొరాదాబాద్​ జిల్లా భోజ్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 15 యేళ్ల వయస్సున్న బాలిక ఈ నెల ఒకటో తేదీన పక్క గ్రామంలో జరుగుతున్న సంతకు వెళ్లింది. తిరిగి ఆ బాలిక ఒక్కతే వస్తుండగా, నితిన్, కపిల్, అజయ్, నాజియా అలీ, ఇమ్రాన్​ కలిసి.. బాలికను ఓ నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లారు. ఆమెను వివస్త్రను చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
సమీపంలోని పొలాల్లో పని చేసుకుంటున్నవారు.. బాధితురాలి అరుపులు విని, అటు వైపు వచ్చారు. వెంటనే నిందితులంతా అక్కడ నుంచి పారిపోయారు. బాధితురాలు అలానే నగ్నంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లి.. కుటుంబసభ్యులకు జరిగినదంతా చెప్పింది. బాలిక నగ్నంగా నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను ఓ మహిళ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. 
 
ఇది వైరల్ కాగా.. పోలీస్​ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. అయితే.. ఫిర్యాదును స్వీకరించి, కేసు నమోదు చేసే విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే బాధితురాలు, కుటుంబం కలిసి పోలీస్ స్టేషన్​కు వెళ్లి, ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని కొందరు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ఉక్కు సత్యాగ్రహం ఇన్ స్పైరింగ్ గా ఉంది : సీబీఐ మాజీ వీవీ లక్ష్మి నారాయణ

నాకు మరిన్ని మంచి లవ్ స్టోరీస్ రాబోతున్నాయి : మిస్ యు హీరో సిద్ధార్థ్

Pushpa 2: The Rule నటుడు శ్రీతేజ్ పెళ్లి చేసుకుంటానని మోసం: యువతి ఫిర్యాదు

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం