Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటి కుర్రాడే కదా అని కాస్త చనువిస్తే, అత్యాచారం చేసి వీడియోలు తీసి...

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (16:24 IST)
పక్కింటి కుర్రాడే కదా తన భర్తతో మాట్లాడేందుకు వస్తున్నాడు కదా అతనితో మాట్లాడితే తప్పేమి లేదనుకుంది ఆ వివాహిత. అతనితో అన్ని విషయాలను చెప్పింది. అయితే అతని దుర్భుద్దిని మాత్రం తెలుసుకోలేకపోయింది. ఆ యువకుడి చేతిలో తన జీవితం నాశనమైపోతుందని అస్సలు ఊహించలేకపోయింది.

 
పంజాబ్ లోని లూథియానాలోని న్యూ పునీత్ నగర్లో నివాసముంటున్నారు స్వప్న కౌర్, రాకేష్‌లు. వీరికి వివాహమై ఒక బాబు కూడా ఉన్నాడు. స్వప్న అందంగా ఉంటుంది. పెళ్ళయిన తరువాత కూడా తన అందాన్ని కాపాడుకుంటూనే వస్తోంది. అయితే స్వప్నపై కన్నేశాడు ఇంటి పక్కన ఉన్న కుర్రాడు ధీరజ్. 

 
ఆమెను ఎలాగైనా లోబరుచుకోవాలన్న ఉద్దేశంతో ఆమె భర్తకు దగ్గరయ్యాడు. రాకేష్ ఉద్యోగానికి సెలవు పెట్టిన సమయంలో అతనితోనే ఒకరోజంతా గడిపేవాడు. అతని ఇంట్లోనే ఉంటూ ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండేవారు. స్థానికంగా ఉన్న విషయాలను అతనితో పంచుకుంటూ ఒక మంచి స్నేహితుడయ్యాడు.

 
తన భర్త స్నేహితుడే కదా అని ఆ వివాహిత నమ్మకం. ఆ యువకుడిలోని దుర్భిద్ధిని అస్సలు గ్రహించలేకపోయింది. రాకేష్ ఇంట్లో లేని సమయంలో అప్పుడప్పుడూ వచ్చి వెళుతుండేవాడు. ఇలా స్వప్నకు దగ్గరయ్యాడు.

 
కూల్ డ్రింక్ తీసుకొచ్చి అందులో మత్తు మందు కలిపి ఆమెకు తాగించాడు. ఆ తరువాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసి వీడియోలను తీశాడు. అంతటితో ఆగలేదు. అలా ఆ వీడియోలను చూపించి బెదిరించి 15రోజుల పాటు ఆ వివాహితను లొంగదీసుకున్నాడు. 

 
యువకుడి కారణంగా తన జీవితం నాశనమైపోతుందన్న భయం ఆ వివాహితలో అలాగే ఉండేది. దీంతో ఆ యువకుడు చెప్పినప్పుడల్లా అతనితో శారీరకంగా కలిసేది. ఇలా ఉండడంతో రాకేష్‌కు అసలు విషయం తెలిసింది. భార్యదే తప్పు అన్న అనుమానంతో రాకేష్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 
చనిపోయే ముందు ఒక లేఖ రాసి చనిపోయాడు. అయితే అసలు విషయం భార్య పోలీసులకు తెలిపింది. తన భర్త చనిపోవడంతో స్వప్న కన్నీంటి పర్యాంతమవుతోంది. తన కుటుంబం నాశనమవ్వడానికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments