Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ : నా భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు : భార్య పటిషన్

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (17:17 IST)
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు రాజశేఖర్‌పై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ ఆయన భార్య సుచరిత ఆరోపించారు. అందువల్ల తన భర్తకు పరీక్షలు చేయించాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజశేఖర్‌ రెడ్డిని కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించామని పోలీసు శాఖ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 
 
కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరిచే ముందు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కోర్టుకు వివరించారు. కస్టడీకి ఇచ్చే ముందు నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకే విచారణ జరుగుతుందన్నారు. ఈ వాదనలు ఆలకించిన హైకోర్టు.. పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ విషయంలో ఇంకేమైనా సమస్యలుంటే నాంపల్లి కోర్టును ఆశ్రయించాల్సిందిగా పిటిషనర్‌కు ఉన్నత న్యాయస్థానం సూచించింది.
 
మరోవైపు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఉస్మానియా జేఏసీ ఆందోళనకు దిగింది. గ్రూప్‌-1 తర్వాత జరిగిన చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (సీడీపీవో) పరీక్ష కూడా రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. గ్రూప్‌-1 తర్వాత జరిగిన ఈ పరీక్షను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించింది. సీడీపీవో పేపర్‌ కూడా లీకేజీ అయ్యిందని ఓయూ జేఏసీ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments