Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఏఎస్ అధికారిగా నమ్మించి రూ.కోట్లు మోసం చేసిన హిజ్రా.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (10:12 IST)
ఇటీవలి కాలం పెళ్లిళ్లు, ఉన్నతాధికారుల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా హిజ్రా ఐఏఎస్ అధికారిణి పేరుతో ఏకంగా ఎనిమిది మందిని మోసం చేసింది. వారి నుంచి రూ.కోట్లలో నగదు దోసుచుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత వరుడు ఇంట్లో నుంచి నగదు, నగలతో పారిపోయేది. చివరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ హిజ్రా అచ్చం స్త్రీని పోలివుంటుంది. పైగా, ఎంతో అందంగా ఉంటుంది. దీనికితోడు తాను ఐఏఎస్ అధికారినని తన చుట్టుపక్కల వారిని నమ్మించింది. ఈ హిజ్రా పేరు బబితా రోజ్. ఐఏఎస్ అధికారిణిగా చెలామణి అవుతూ, గొప్పగొప్ప వాళ్లతో తనకు పరిచయాలు ఉన్నాయని ప్రతి ఒక్కరిని నమ్మబలికింది. 
 
ఈ క్రమంలో ప్రేమిస్తున్నానంటూ ఏకంగా 15 మందిని నమ్మించింది. ఆపై తిరుచ్చి, కడలూరు, కళ్లకుర్చి, కోయంబత్తూరు, మడాత్తికుళం, తిరుపూరు, విరుదునగర్, రాజపాళెయం, నాగర్ కోయిల్ తదితర ప్రాంతాలకు చెందిన 8 మందిని పెళ్లాడింది. వీరిలో పలువురు బడా వ్యాపారులు, పోలీసులు కూడా ఉండటం గమనార్హం. 
 
మెడలో మూడు ముళ్లు పడిన తర్వాత వరుడు ఇంట్లో నుంచి నగదు, నగలు, ఇతర ఆభరణాలు తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా పారిపోయేది. ఇలా ఆమె చేతిలో మోసపోయిన బాధితులు తాజాగా తిరుచ్చి ఎస్పీ సుజిత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. హిజ్రా బబితా రోజ్‌ను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బబిత కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments