Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిక్నిక్‌కు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై దాడి.. స్నేహితురాలిపై అత్యాచారం.. ఎక్కడ?

ఠాగూర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (09:43 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో దారుణం జరిగింది. స్నేహితురాళ్లతో కలిసి బయటకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై కొందరు దుండగులు దాడి చేశారు. ఆ తర్వాత స్నేహితురాలిపై సామూహిక లైంగికదాడికి పాల్పడటమే కాకుండా, వారి నుంచి డబ్బు కూడా దోచుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దిగ్భ్రాంతికర ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఇండోర్‌లోని మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణలో ఉన్న ఇద్దరు యువ ఆర్మీ అధికారులు తమ స్నేహితురాళ్లతో కలిసి సమీపంలోని ఓ పిక్నిక్ స్పాట్‌కు వెళ్లారు. అక్కడ కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వీరిపై దాడి చేశారు. తొలుత వారి వద్ద ఉన్న డబ్బు, నగలను బెదిరించి తీసుకున్న దుండగులు.. ఆ తర్వాత మహిళల్లో ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న ఓ ట్రైనీ ఆఫీసర్ పోలీసులు, ఆర్మీ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. 
 
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేసరికి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. బాధిత మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అత్యాచారం జరిగినట్లు నిర్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరికి గతంలో క్రిమినల్ రికార్డు ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments