Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ : సీఎం మోహన్ యాదవ్ వెల్లడి

mohan yadav

వరుణ్

, బుధవారం, 7 ఆగస్టు 2024 (10:35 IST)
గత వైకాపా ప్రభుత్వంలో తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తీసుకునిరానున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీరు వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీల పనితీరుపై పర్యవేక్షణ, వివిధ పథకాల అమలు వంటి బాధ్యతలను వాలంటీర్లకు అప్పగించాలని తమ ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. 
 
ఇదే అంశంపై సీఎం మోహన్ భగవత్ మాట్లాడుతూ, పంట నష్టాన్ని పరిశీలించి, ఆ వివరాలను ప్రభుత్వానికి అందజేస్తారని, ఆ వివరాలను ప్రభుత్వం పరిశీలించి పంట నష్టానికి పరిహారం చెల్లిస్తుందని వివరించారు. ఇలాంటి పనులకు ప్రభుత్వ ఉద్యోగికి బదులుగా వాలంటీరు సేవలు వినియోగించుకుంటామన్నారు. ఇప్పటిదాకా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్వారీలదే రాజ్యమని... వాలంటీరు వ్యవస్థతో సంస్కృతికి చరమగీతం పాడతామన్నారు. వాలంటీర్లు తమకు కేటాయించిన గ్రామాల్లో ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారి జాబితాలు కూడా తయారుచేసి ప్రభుత్వానికి సమర్పిస్తారని వెల్లడించారు. అయితే, బీజేపీ కార్యకర్తలనే వలంటీర్లుగా నియమించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
కాగా, ఏపీలో గత ఐదేళ్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వంలో వలంటీర్లు ఇష్టారాజ్యంగా నడుచుకున్నారు. ఈ కారణంగానే వైకాపా ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకుంది. ఫలితంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా చిత్తుచిత్తుగా ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైకాపా 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్థిక మోసం కేసులో పద్మశ్రీ అవార్డు గ్రహీత అరెస్టు!! దేశ చరిత్రలోనే తొలిసారి!!