Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిస్కెట్ల ఆశ చూపి చిన్నారి జీవితాన్ని చిదిమేసిన బీహార్ యువకుడు!

వరుణ్
గురువారం, 18 జులై 2024 (09:43 IST)
బిస్కెట్ ఆశ చూపి ఓ చిన్నారి జీవితాన్ని బీహార్‌కువ చెందిన ఓ యువకుడు చిదిమేశాడు. గంజాయి మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డాడు. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన కొన్ని కుటుంబాల ప్రజలు మండలంలోని ఓ గ్రామ రైస్ మిల్లులో పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. అక్కడ భార్యాభర్తలు కూడా పనిచేస్తున్నారు. ఆ దంపతుల రెండో కుమార్తె (8)ను అదే మిల్లులో పనిచేస్తున్న బీహారీ యువకుడు దిలీప్ (20) బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఉదయం తీసుకెళ్లాడు. మధ్యాహ్నం మిల్లు నుంచి వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల అంతా వెతికారు.
 
ఈ క్రమంలో పాప మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో పశువులకాపర్లు గుర్తించి స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐలు జగన్మోహన్ రావు, శ్రీనివాసులు రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలిక నోటితోపాటు పలు శరీర భాగాల్లో గాయాలను గమనించారు. నిందితుడు అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఉంటాడొచ్చనే అనుమానంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. 
 
దిలీప్ బాలికను తీసుకెళుతున్న దృశ్యాలను సీసీటీవీ కెమెరా ఫుటేజీ ద్వారా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికకు బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లానని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు గుర్తు లేదని చెప్పాడు. దీంతో, అతడు గంజాయి మత్తులో ఘోరానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావించారు. అయితే, మంగళవారం రాత్రి దిలీప్ గంజాయి మత్తులో బాలిక తండ్రితో గొడవ పడ్డాడు. ఆ మరుసటి రోజే ఇలా జరగడంతో కావాలనే చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments