Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో బాలికపై అత్యాచారం.. గర్భందాల్చడంతో వెలుగులోకి...

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (12:25 IST)
విజయవాడ నగరంలో మరో బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. స్నేహం పేరుతో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నగరంలోని బెంజి సర్కిల్‌ ప్రాంతానికి చెందిన నిందితుడు సాయి బాధిత బాలిక (14)తో స్నేహం పేరుతో పరిచయం పెంచుకున్నాడు. ఈ యేడాది మే నెలలో బాలికను తన బైక్‌పై ఎక్కించుకుని పటమట జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలోని ఓ భవనంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
మరో రెండు రోజుల తర్వాత మరో భవనంలోకి తీసుకెళ్లిన సాయి.. తన స్నేహితులు బబ్లు, ప్రకాశ్‌లను అక్కడికి పిలిపించి, వారంతా కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను తీసుకొచ్చి ఇంటివద్ద వదిలిపెట్టారు. 
 
అయితే, గత కొన్ని రోజులుగా బాలిక శరీరంలో మార్పులు రావడాన్ని గమనించిన తల్లదండ్రులు నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యుల వద్దకు తీసుకెళ్లగా ఆ బాలిక ఆరు నెలల గర్భవతిగా తేల్చారు. 
 
బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments