Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 5 March 2025
webdunia

కాళ్లు చేతులు కట్టేసి.. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి చంపేశారు.. ఎక్కడ?

Advertiesment
murder
, గురువారం, 13 అక్టోబరు 2022 (11:05 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం శివారులో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. రింగు రోడ్డు సర్వీసు రహదారిపై గుర్తుతెలియని యువకుడిని కాళ్లు, చేతులు కట్టేసి తలకు ప్లాస్టిక్‌ కవర్‌ను చుట్టి చంపేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్య గురువారం తెల్లవారుజామున జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. 
 
ఇతర ప్రాంతాల్లో హతమార్చి ఇక్కడికి తెచ్చారా? ఇక్కడే హత్య చేశారా అనేది విచారణలో తేలుతుందని పోలీసులు చెప్పారు. క్లూస్‌ టీంను పిలిపించి ఆధారాలు సేకరిస్తున్నామని ఐడీఏ బొల్లారం సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు. 
 
కాగా, ప్రేమ వ్యవహారం లేదా ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. యువకుడు వయసు 30 ఏళ్లలోపే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నరబలి కేసులో కొత్త ట్విస్ట్ : శరీరాన్ని 56 ముక్కలు చేసి వండి ఆరగించారు...